చిరంజీవి హనుమాన్ భక్తుడు ఎలా అయ్యారంటే.? పొన్నూరులో ఏడో తరగతి చదువుకునే సమయంలో..!

చిరంజీవి హనుమాన్ భక్తుడు ఎలా అయ్యారంటే.? పొన్నూరులో ఏడో తరగతి చదువుకునే సమయంలో..!

by Mounika Singaluri

Ads

మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయ స్వామికి పెద్ద భక్తుడని అందరికీ తెలిసిందే. ఇదే విషయం ఆయన చాలాసార్లు ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఎందుకు హనుమంతుడిని అంతగా అభిమానిస్తారు అనే విషయం ఇప్పటివరకు ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన చిరంజీవి సినిమా గురించి మాట్లాడుతూ అలాగే తన భక్తి గురించి కూడా ఈ విధంగా చెప్పుకొచ్చారు.

Video Advertisement

చిన్నప్పుడు నాన్నగారు కమ్యూనిస్టు అవటం వలన దేవుడని పెద్దగా ప్రార్థించే వారు కాదు అమ్మ ఒత్తిడి మేరకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అప్పుడప్పుడు దర్శించుకునే వారు. పొన్నూరులో ఏడో తరగతి చదువుకునే సమయంలో ఆంజనేయస్వామి గుడి ఉండేదట. రోజు దండం పెట్టుకొని వచ్చేవాడట చిరంజీవి. ఎనిమిదవ తరగతి బాపట్లలో చదువుకునే సమయంలో కూడా అక్కడ ఆంజనేయస్వామి గుడి ఉండేది ట్యూషన్ కి వెళ్లి వచ్చేటప్పుడు ఆ గుడి వద్ద ప్రసాదం ఇచ్చేవారు.

ఆ ప్రసాదం కోసం వెళ్ళీ వెళ్ళీ ఆంజనేయుడు పై భక్తి ఏర్పడిందని చెప్పుకొచ్చారు చిరంజీవి. మొగల్తూరులో చదువుకునే సమయంలో రోడ్డుపై మిఠాయి కొంటే హనుమంతుడి క్యాలెండర్ బహుమతిగా ఇచ్చారు. ఆ బొమ్మ ఇప్పటికీ ఇంట్లో ఉంది. అలాగే చిరంజీవి పదో తరగతి చదువుకునే సమయంలో తండ్రికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడికి వెళ్ళటం ఇష్టం లేని తన తండ్రి లాంగ్ లీవ్ పెట్టేసారట ఆ సమయంలో ఆయన బాగా ఒత్తిడికి గురవుతుంటే హనుమాన్ చాలీసా చదవమని చిరంజీవి సలహా ఇచ్చారట.

సంశయిస్తూనే హనుమాన్ చాలీసా చదివిన తన తండ్రికి ఉన్న ఊర్లోనే మళ్లీ జాబ్ ట్రాన్స్ఫర్ అయిందట అప్పటినుంచి తన తండ్రికి కూడా హనుమంతుడి మీద భక్తి ఏర్పడిందని చెప్పుకొచ్చారు చిరంజీవి. అలాగే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరాలనుకునే సమయంలో కూడా ఆంజనేయస్వామి బొమ్మ దొరకటం దానిని లాకెట్ గా చేసి మెడలో వేసుకోవడం ఆ తర్వాత అవకాశాలు రావటం ఇలాంటి విషయాలన్నీ చెప్పుకొచ్చారు చిరంజీవి. అలాగే హనుమాన్ మూవీ టైటిల్ కూడా మొదటగా తన నోటి నుంచి వచ్చిందని,నేను ఏదో ఇంటర్వ్యూలో చెప్తే దాన్ని టైటిల్ గా పెట్టుకున్నారు అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి.

హనుమజ్జయంతి రోజున చిరు పోస్ట్ చేసారు…ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది…చిన్నప్పటి నుంచి…1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, “ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి” అన్నారు. అప్పటి నా ఫోటో..

కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద reproduce చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా …? బాపు గారు చెప్పిన మాట “ఏంటోనండి …బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి …అలానే ఉంచేసాను …మార్చలేదు ” అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు.


End of Article

You may also like