మీరు వాడే పనీర్ సహజమైనదా.? నకిలీదా.? తెలుసుకోవాలంటే ఈ చిట్కా పాటించండి.!

మీరు వాడే పనీర్ సహజమైనదా.? నకిలీదా.? తెలుసుకోవాలంటే ఈ చిట్కా పాటించండి.!

by Mohana Priya

Ads

పాల పదార్థాల్లో మనం ఎక్కువగా ఉపయోగించే పదార్థాల్లో ఒకటి పనీర్. విరిగిపోయిన పాలతో తయారు చేసే ఈ పనీర్ ని ఎక్కువగా కూరలలో, బిర్యాని వంటి పదార్థాల్లో, లేదా స్వీట్స్ లో ఉపయోగిస్తారు. ఈమధ్య పనీర్ క్యూబ్స్ గా కట్ చేసి రెడీమేడ్ గా దొరుకుతున్నాయి. అయితే, ఇలా దొరికే పన్నీర్ అంతా స్వచ్ఛమైనది అయ్యే అవకాశం లేదు.

Video Advertisement

how to identify weather paneer is original or not

ఇందులో కొన్ని సార్లు నకిలీ పనీర్ కూడా అమ్మే అవకాశాలు ఉంటాయి. అలా పనీర్ లో అసలు ఏదో, నకిలీ ఏదో తెలుసుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. నిజమైన పనీర్ అయితే మృదువుగా ఉంటుంది. అదే నకిలీది అయితే గట్టిగా ఉంటుంది. నిజమైన పనీర్ తిన్న అంత సులభంగా నకిలీ పనీర్ తినలేము.

how to identify weather paneer is original or not

అంతే కాకుండా నకిలీ పనీర్ కట్ చేసినప్పుడు రబ్బర్ లాగా సాగుతుంది. గ్రేవీ మీద వేసినప్పుడు పగిలిపోతే అది నకిలీ పనీర్ అని అర్థం. పనీర్ ని నీటిలో బాగా మరిగించండి. తర్వాత కొంచెం సేపు చల్లార్చండి. అలా చల్లారిన పనీర్ మీద రెండు మూడు చుక్కల అయోడిన్ టించర్ వేయండి.

how to identify weather paneer is original or not

ఒకవేళ పనీర్ రంగు తెలుపు నుండి నీలం రంగుకి మారితే అది నకిలీ అని అర్థం. అందులో ఆర్టిఫిషియల్ కెమికల్ కలపబడి ఉంది అని మీరు తెలుసుకోవచ్చు. అంతే కాకుండా పనీర్ ని గట్టిగా రబ్ చేయండి. ఒకవేళ అది ముక్కలు ముక్కలుగా విరిగి పోతే అది నకిలీ పనీర్ అని అర్థం. లేకపోతే ఆ పనీర్ అసలైనది అని అర్థం. మామూలుగా చూస్తే గనుక అసలు కి నకిలీ కి అంత పెద్ద తేడా తెలియదు. కాబట్టి పనీర్ ఉపయోగించే ముందు ఒకసారి ఈ చిట్కా పాటించండి.


End of Article

You may also like