మీ మొబైల్ ని లాప్ టాప్ మరియు కంప్యూటర్ కి కనెక్ట్ చేయడానికి ఈ యాప్ మీకు చాలాఉపయోగపడుతుంది,ఇది ఉపయోగించుకొని మీ మొబైల్ మీరు చూసే ప్రతిదీ స్టోమింగ్ సేవలు, ఫోటోలు, వీడియోలు, వెబ్ పేజీలు,గేమ్స్ ఇతర రకాలు మీ లాప్ టాప్ మరియు కంప్యూటర్ లో ప్రదర్శించబడతాయి.,,దీనినే స్క్రీన్ మిర్రరింగ్ అంటారు ఈ యాప్ మీకు ప్లేస్టోర్, యాప్ స్టోర్ మరియు కంప్యూటర్లలో లభిస్తుంది, ఇందులో కూడా మీరు ఒక్కటే Wifi నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉండాలి, ముందుగా మీరు మీ కంప్యూటర్ లో LetsView సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి.తర్వాత మీ మొబైల్ లో LetsView యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి,ఇందులో 3 రకాలుగా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు.

Video Advertisement

1.ముందుగా మీరు మీ కంప్యూటర్ లో కూడా LetsView అప్లికేషన్ ఓపెన్ చేయండి,ఆ తర్వాత మీరు మొబైల్ లో LetsView యాప్ ఓపెన్ చేయండి, మీ కంప్యూటర్ తో కనెక్ట్ అవ్వడానికి Redetect మీద క్లిక్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు.

2. కంప్యూటర్ లో కూడా LetsView అప్లికేషన్ ఓపెన్ చేయండి,అక్కడ మీకు QR కోడ్ ఫోటో కనిపిస్తుంది,
ఆ తర్వాత మీరు మొబైల్ లో LetsView యాప్ ఓపెన్ చేయండి,అక్కడ మీకు QR కోడ్ ఆప్షన్ కనిపిస్తుంది.QR కోడ్ స్కాన్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు.

3.కంప్యూటర్ లో కూడా LetsView అప్లికేషన్ ఓపెన్ చేయండి,అక్కడ మీకు 4 సంఖ్యలతో తో ఒక నెంబర్ కనిపిస్తుంది,ఆ తర్వాత మీరు మొబైల్ లో LetsView యాప్ ఓపెన్ చేయండి,అక్కడ మీకు కోడ్ ఎంటర్ ఆప్షన్ కనిపిస్తుంది,అక్కడ మీరు కోడ్ ఎంటర్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు.

 

PC DOWNLOAD LINK https://letsview.com/