మనం తీసే నిమిషం వీడియో 100 MB ఉంటుంది.. కానీ రెండున్నర గంటల సినిమా HD వీడియో 2 GB కూడా దాటదు.. కారణమేంటి?

మనం తీసే నిమిషం వీడియో 100 MB ఉంటుంది.. కానీ రెండున్నర గంటల సినిమా HD వీడియో 2 GB కూడా దాటదు.. కారణమేంటి?

by Anudeep

Ads

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేని వారు అంటూ ఎవరు లేరు. అందరి వద్దా చిన్నదో పెద్దదో స్మార్ట్ ఫోన్ ఉంటూనే ఉంటుంది. అయితే.. మాములుగా మనం ఫోన్ లో కూడా వీడియోస్ తీస్తూ ఉంటాము. ఒక్క నిమిషం పాటు వీడియో ను తీస్తే అది ఎంతలేదన్నా 100 MB ఉంటుంది.

Video Advertisement

అదే రెండున్నర గంటల సినిమా వీడియో మాత్రం రెండు GB లకు మించదు. ఇలా ఎందుకు అవుతుంది..? అన్న సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? అయితే ఈ ఆర్టికల్ చదివి అసలు కారణం ఏంటో తెలుసుకోండి.

video 1

సినిమా ను చాలా హై రిజల్యూషన్ వీడియోలతో షూట్ చేస్తారు. బ్లాక్ మ్యాజిక్ లాంటి కెమెరాలతో వారు సినిమాలను షూట్ చేస్తారు. అయితే.. ఇలా సినిమా మొత్తాన్ని షూట్ చేయడానికి వారికి 500gb హార్డ్ డిస్క్ అవసరం అవుతుంది. వీరు హై రిజల్యూషన్ లో 4k ఫార్మాట్ లో రికార్డు చేసుకుంటారు. ఆ వీడియోని తరువాత మనం చూసే ఫార్మాట్లలో కి మారుస్తారు.

video 2

రికార్డు చేయడానికి వాడే ఫార్మాట్ వేరు. మనం చూడడానికి ప్లే చేసే ఫార్మాట్ వేరుగా ఉంటుంది. రికార్డు చేసిన వీడియోల మెమరీ వందల gb లలో ఉంటుంది. ఎక్కువ బిట్స్ ని కవర్ చేయడం కోసం వారు ఎక్కువ బిట్ రేట్ ఉన్న రికార్దింగ్ ఫార్మాట్ ను ఉపయోగిస్తారు. ఆ వీడియోస్ ను వీడియో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ లలో ఎడిట్ చేసి ప్లే చేస్తారు. సినిమా హాల్ కు తగ్గట్టుగా వీడియో రిజల్యూషన్ ను తగ్గిస్తారు.

video 3

ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ అయినప్పుడు ఉన్న బిట్ రేట్ ను సగానికి తగ్గిస్తారు. అప్పుడు వీడియో మెమొరీ కూడా సగానికి తగ్గిపోతుంది. కానీ, అదే క్లారిటీ మైంటైన్ అవుతుంది. ఇందుకోసం అడోబ్ ప్రీమియర్ లాంటి సాఫ్ట్ వేర్ లను ఉపయోగిస్తారు. 2gb లో ఉన్న సినిమా వీడియో అనేది పూర్తిగా కంప్యూటర్ లు, మొబైల్స్ లలో చూడడానికి అనువుగా ఉంటుంది. అయితే ఇది సినిమా హాల్ లో ప్రదర్శించడానికి సరిపోదు.

 


End of Article

You may also like