“లైగర్” సినిమా వల్ల అందరికంటే ఎక్కువ నష్టపోయిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా.? అసలేమైందంటే.?

“లైగర్” సినిమా వల్ల అందరికంటే ఎక్కువ నష్టపోయిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా.? అసలేమైందంటే.?

by Anudeep

Ads

ఇంతవరకు సినిమా తీసిన నష్టపోయిన నిర్మాతను చూసుంటారు కానీ మొట్టమొదటిసారి భారీగా పంతానికి పోయి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ గా వరంగల్ శీను ఈ మధ్యకాలంలో నెట్లో బాగా వైరల్ అయ్యారు. క్రాక్ , ఇస్మార్ట్ శంకర్ సినిమాల తర్వాత మంచి ఫేమ్ తో పాటు లాభాలు సంపాదించిన డిస్ట్రిబ్యూటర్స్ లో వరంగల్ శ్రీను ఒకరు.

Video Advertisement

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాధ్ ల సినిమా లైగర్ ను 75 కోట్ల రూపాయలు పైగానే ఖర్చు పెట్టి మరి డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నారనే విషయం చాలామందికి తెలియదు.

ఇప్పుడు తాజాగా అందిన ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం ..వరంగల్ శ్రీను లైగర్ కారణంగా సుమారు రూ. 50 కోట్లను నష్టపోతారని అంచనా.మరి తమ కోసం ఇంత చేసిన డిస్ట్రిబ్యూటర్ని ఆదుకోవడానికి పూరి జగన్నాథ్ మరియు విజయ దేవరకొండలు ముందుకు వస్తారా? లేదు మాకెందుకు అన్నట్టు ఉంటారా వేచి చూడాలి. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను తన సినిమాలు ఎంచుకునే సమయంలో ఆచితూచి నిధానంగా నిర్ణయం తీసుకోకపోవడంతో 2022లో భారీ నష్టాలను చవి చూశాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సంవత్సరం జరిగిన ప్రతి డిజాస్టర్ మూవీ వెనుక ఆయనే ఉన్నాడు.

liger 4

గతంలో చిరంజీవి, రామ్ చరణ్‌ల ఆచార్య సినిమాల నైజాం హక్కులను వరంగల్ శ్రీను కొన్నాడు.ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ నైజాంలో ఆచార్య రిజల్ట్ ఏంటో అందరికి తెలిసిందే. ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆచార్య డిస్ట్రిబ్యూటర్లకు నష్టాన్ని మిగిల్చింది. అయితే ఆ సినిమా నష్టాలు తగ్గించాలి అన్న ఉద్దేశంతో నిర్మాత హీరో కలిసి ఎంత ప్రయత్నించినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అయినా ఏమాత్రం తగ్గకుండా తిరిగి విరాటపర్వం నైజాం రైట్స్ కూడా వరంగల్ శీను కొనుగోలు చేశారు. అది బాక్స్ ఆఫీస్ డిజాస్టర్ గానే మిగిలింది.

అత్యంత భారీ బ్లాక్ బస్టర్ గా అంచనా వేయబడిన పూరి జగన్నాథ్ లైగర్ మూవీ కోసం పూర్తి సౌత్ ఇండియన్ హక్కులను వరంగల్ శీను కొనుగోలు చేశాడు. అంతేకాకుండా లైగర్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడని, ఈ ఒక్క సినిమాతో ఈ సంవత్సరం వచ్చిన నష్టాలు అన్ని పూడ్చుకోవచ్చు అని ఆశపడ్డాడని సమాచారం. కానీ రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ టాక్ తో కొనసాగుతున్న లైగర్ ఇంచుమించు 50 % వరకు అతనికి నష్టాన్ని మిగులుస్తుంది అని అంచనా.

ఈ క్రమంలో ఇప్పటికే ఈ సంవత్సరం ఇంచుమించు 100 కోట్లు నష్టాన్ని చవిచూచిన వరంగల్ శీను ఇకముందు అయినా రాబోయే సినిమాలను జాగ్రత్తగా సెలక్ట్ చేసుకుంటే మంచిది అని విమర్శకులు అభిప్రాయం.


End of Article

You may also like