మీ బాడీకి తగ్గట్టు షర్ట్, ప్యాంటు ఎంచుకోడంలో ఇబ్బంది పడుతున్నారా.? అయితే ఈ టిప్స్ పాటించండి.!

మీ బాడీకి తగ్గట్టు షర్ట్, ప్యాంటు ఎంచుకోడంలో ఇబ్బంది పడుతున్నారా.? అయితే ఈ టిప్స్ పాటించండి.!

by Megha Varna

Ads

సాధారణంగా పురుషులు ఫ్యాషన్ కు మరియు డ్రెస్సింగ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. అయితే ప్రస్తుతం అందరి ఆలోచనలు మారుతున్నాయి. మహిళలకు సమానంగానే పురుషులు కూడా డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పర్ఫెక్ట్ లుక్ కోసం ఎన్నో రకాల ఫ్యాషన్స్ ను ఫాలో అవుతున్నారు. మరి మీకు సెట్ అయ్యే బట్టలను కొనేందుకు ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇలా తెలుసుకోవచ్చు.

Video Advertisement

#1. షర్ట్స్:

ఎప్పుడైనా మీరు షర్ట్స్ ని కొనడానికి వెళ్ళినప్పుడు షోల్డర్ సైజ్ పర్ఫెక్ట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. షోల్డర్ దగ్గర కరెక్ట్ ఫిట్ కనుక ఉంటే మొత్తం లుక్ బాగుంటుంది. మీ షర్ట్ సైజ్ తెలియకపోతే కేవలం చెస్ట్ సైజ్ తెలుసుకుంటే ఏ బ్రాండ్ లోనైనా సరైన ఎంపిక చేసుకోవచ్చు. కాబట్టి సైజ్ చార్ట్ మరియు గైడ్ ను తప్పకుండా ఫాలో అవ్వండి.
షర్ట్ ను కొనుక్కునే ముందు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే స్లీవ్ లెంత్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలి. సరైన లెంత్ లేకపోతే దాన్ని సరి చేయడం చాలా కష్టం, లుక్ పర్ఫెక్ట్ గా ఉండదు.


షర్ట్ లెంత్ మరీ ఎక్కువగా మరియు మరీ తక్కువగా ఉండకుండా చూసుకోవాలి.
లావుగా ఉండేవారు ఫుల్ స్లీవ్స్ ను ప్రిఫర్ చేయండి మరియు నిలువు చారలు ఉన్నవి తీసుకోండి. దాంతో మీరు సన్నగా కనబడతారు.
అదే బాగా సన్నగా ఉండేవారు అడ్డం చారలు ఉన్న షర్ట్స్ ను ప్రిఫర్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల కొంత ఫిట్నెస్ యాడ్ అవుతుంది.
బాగా తెల్లగా ఉన్న వారికి డార్క్ కలర్స్ సెట్ అవుతాయి. అయితే కొంచెం చామనచాయగా ఉన్నవారు లైట్ కలర్స్ ను మరియు కొంతవరకు డార్క్ కలర్స్ ను ప్రిఫర్ చేయవచ్చు.

#2. ప్యాంట్స్:

ఎప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ప్యాంట్స్ ను ప్రిఫర్ చేయండి. ప్రస్తుతం ట్రెండ్ అయితే యాంకిల్ లెంత్ ప్యాంట్స్ ఉన్నాయి. వాటితో పాటు స్నిక్కర్స్ ను వేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది.
ఎప్పుడు కూడా బ్రాండెడ్ దుస్తుల గురించి ఆలోచించకండి. మీకు సెట్ అయిన వాటిని కొనుక్కోండి మరియు బ్రాండ్ కంటే క్వాలిటీ ముఖ్యం అని గమనించాలి.


లావుగా ఉన్నవారు రెగ్యులర్ ఫిట్ ను ఎంచుకోండి. ఎందుకంటే కొంచెం లూజుగా ఉంటేనే అందంగా కనపడతారు. అయితే సన్నగా ఉన్నవారు బాగా ఫిట్ గా ఉన్నవి ధరించకండి.
ఎలాంటి షర్ట్ మరియు టీ షర్ట్ కైనా బ్లాక్ ప్లేన్ జీన్స్ సెట్ అయిపోతుంది అని గుర్తుంచుకోండి.

#3. టీ షర్ట్స్:

చాలా క్యాజువల్ గా కనపడే టీ షర్ట్స్ ఎంతో మంచి లుక్ ని ఇస్తాయి. కానీ సరైన సైజ్ తీసుకుంటేనే చాలా మంచి లుక్ ని పొందుతారు. కాబట్టి టీ షర్ట్ ను కొనేముందు సైజ్ ను తప్పకుండా తెలుసుకోండి.
స్లీవ్ లెంత్ మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా ఉండకుండా చూసుకోండి.
లావుగా ఉండే వారు కొంచెం లూజుగా ఉన్న టీ షర్ట్ ని ధరించండి. ఎందుకంటే టైట్ టీ షర్ట్ వేసుకుంటే మరింత లావుగా కనబడతారు.


సన్నగా ఉండేవారు వారికి తగిన, ఫిట్ గా ఉన్నవి మాత్రమే తీసుకోండి.
ఎప్పుడూ కూడా బ్రాండెడ్ టీషర్ట్స్ ధర క్వాలిటీకి మించి ఉంటుంది. కాబట్టి ఏ బ్రాండ్ అయినా మంచి క్వాలిటీని మాత్రమే ఎంచుకోండి.
ఎప్పుడూ ఒకే రకమైన మోడల్ ను ఎంపిక చేసుకోవద్దు. రౌండ్ నెక్, వీ నెక్, కాలర్ ఇలా కొత్తవి అన్ని ప్రయత్నించండి.


End of Article

You may also like