ఈ 10 పాపులర్ బ్రాండ్స్ ఫారిన్ వి అనుకుంటే పొరపాటే…ఇవన్నీ మన ఇండియన్ బ్రాండ్స్.!

ఈ 10 పాపులర్ బ్రాండ్స్ ఫారిన్ వి అనుకుంటే పొరపాటే…ఇవన్నీ మన ఇండియన్ బ్రాండ్స్.!

by Megha Varna

Ads

ప్రతి పేరు వెనుక ఒక కథ ఉంటుంది లేదా ఓ కారణం ఉంటుంది ఈ విషయం అందరికీ తెలిసిందే.ఇక అసలు విషయమేంటంటే బిజినెస్ లో ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే వారు ఎంచుకున్న కంపెనీ నేమ్,మైంటైన్ చేసే క్వాలిటీ వారిని మార్కెట్ లో బ్రాండ్ గా ఉంచాలో లేదా అనే విషయాన్ని డిసైడ్ చేస్తాయి.మరి అలా మార్కెట్ లో సక్సెస్ అయిన కొన్ని బ్రాండ్స్ ఇండియాకి సంబంధించినవి అయినప్పటికీ వాటి పేర్ల కారణంగా మనం ఇన్నాళ్ళుగా వాటిని ఫారిన్ బ్రాండ్స్ అని భ్రమపడ్డాం.మరి ఆ బ్రాండ్స్ ఏంటో వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

అలెన్ సోలి :

ఇది ఓ క్లోతింగ్ బ్రాండ్.ఈ బ్రాండ్ 1744 నుండి మార్కెట్ లో అవైలబుల్ లో ఉందని వారి షోరూం బయటపెట్టిన హోడింగ్ చూస్తే మనకి అర్థమవుతుంది.ఈ బ్రాండ్ ఫారిన్ కు చెందినది అయినప్పటికీ ప్రస్తుతం ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ లో భాగంగా ఉన్నది.

ఫ్లైయింగ్ మెషిన్ :

ఈ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. క్లోతింగ్ బ్రాండ్స్ లో యూత్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఈ బ్రాండ్ నే.మరి అలాంటి ఈ బ్రాండ్ ని అరవింద్ ఆపిరల్స్ యూనిట్ సంస్థ నడుపుతుంది.

పీటర్ ఇంగ్లాండ్ :

పేరులో ఇంగ్లాండ్ ఉందని దీన్ని ఫారిన్ బ్రాండ్ అనుకుంటే మీరు పప్పులో కాలిసినట్టే ఈ బ్రాండ్ ను 2000 నుండి ఆదిత్య బిర్లా గ్రూప్ రన్ చేస్తుంది.మంచి ఫార్మల్స్ కోసం అందరూ ఈ బ్రాండ్ ను ప్రిఫర్ చేస్తుంటారు.

మోంటే కార్లో :

వినడానికి ఫారిన్ నేమ్ లో ఉన్న ఈ క్లోతింగ్ బ్రాండ్ ఇండియాకు చెందినది.దీనికి సంబందించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ జలంధర్లో రెండున్నాయి.

లాక్ మీ :

వినడానికి కొత్తగా ఉన్న ఈ పేరును చూసి ఎవరైనా దీన్ని ఫారిన్ బ్రాండ్ అనుకుంటారు.కాని ఇది మొదట్లో టాటా గ్రూప్ కాస్మోటిక్ బ్రాండ్.ప్రస్తుతానికి దీన్ని హిందూస్తాన్ యునిలివర్ వారు నడిపిస్తున్నారు.

జాగ్వార్ కార్స్ :

ఒకప్పుడు రతన్ టాటాను అవమానించిన ఫోర్డ్ కంపెనీ.ఆతర్వాత కాలంలో వారికి చెందిన జాగ్వర్ కార్స్ బ్రాండ్ ను 2008 లో టాటా మోటార్స్ కు అమ్మింది

టెట్లి :

ఈ బ్రాండ్ ఇంగ్లాండ్ లోని యార్క్ షైర్ లో 1837 లో స్టార్ట్ అయ్యింది.ఆతర్వాత ఈ బ్రాండ్ ను 2000 సంవత్సరంలో టాటా గ్రూప్ కొనుగోలు చేసి ఈ బ్రాండ్ బాగా పాపులర్ చేసింది.

రాయల్ ఎన్ ఫీల్డ్ :

ఈ బ్రాండ్ మోటార్ బైక్స్ కు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది.దీన్ని కొనడానికి మన దేశంలోని యువత వెంపర్లాడుతుంటారు.ఈ బ్రాండ్ ఐచర్ మోటార్ సైకిల్స్ వారికి చెందింది.

లా ఒపాలా :

కంఫర్టబుల్ అండ్ ఖరీదైన కిచెన్ వేర్, డైనింగ్ ను ప్రొడ్యూస్ చేయడంలో టాప్ కంపెనీస్ లో ఒకటైన లా ఒపాలా ను 1987 లో సుశీల్ ఝున్ జున్ వాలా స్థాపించారు.

హై డిజైన్ :

హ్యాండ్ బ్యాగ్స్, కర్చీఫ్స్,వాలెట్ వంటి లెదర్ గూడ్స్ ను ప్రొడ్యూస్ చేసే ఈ బ్రాండ్ ను 1978 లో దిలీప్ కపూర్ పుదుచ్చేరిలో ప్రారంభించారు.

 


End of Article

You may also like