Ads
ప్రముఖ క్రికెటర్ దినేష్ కార్తీక్ జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ధోనికి రెండో వికెట్ కీపర్ గా, తమిళనాడు టీంకి కెప్టెన్‌గా దినేష్ కార్తీక్ ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. దినేష్ కార్తీక్ టీం మేట్ అయిన మురళీ విజయ్ దినేష్ కార్తీక్ భార్యతో రిలేషన్ లో ఉన్నారు. ఈ విషయం దినేష్ కార్తీక్ కి తప్ప తమిళనాడు రంజీ టీం మొత్తానికి తెలుసు.
Video Advertisement
ఒకరోజు దినేష్ కార్తీక్ భార్య మురళీ విజయ్ బిడ్డతో తను గర్భవతిగా ఉన్నట్టు, తనకి దినేష్ కార్తీక్ నుండి విడాకులు కావాలి అని చెప్పింది. వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మురళీ విజయ్, దినేష్ కార్తీక్ భార్యతో కలిసి ఉన్నారు. అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి, టీమ్ ఇండియాకి ఓపెనర్ గా ఉన్నారు.
దినేష్ కార్తీక్ అప్పుడు చాలా కుంగిపోయారు. డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఈ ప్రభావం దినేష్ కార్తీక్ ఆట మీద కూడా పడింది. రంజీ మ్యాచ్ లలో ఓడిపోయారు. కెప్టెన్సీ కూడా పోయింది. ఐపీఎల్ లో కూడా ఆశించిన విధంగా ఆడలేకపోయారు. ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారు. జిమ్ కి వెళ్లడం కూడా మానేశారు. అలాంటి సమయంలో దినేష్ కార్తీక్ ట్రైనర్ ఇంటికి వెళ్లి దినేష్ కార్తీక్ ని చూశారు. అప్పుడు దినేష్ కార్తీక్ చాలా పాడైపోయి ఉన్నారు. ట్రైనర్ దినేష్ కార్తీక్ తో మళ్ళి జిమ్ కి వెళ్ళడం మొదలు పెట్టమని చెప్పారు. అదే ట్రైనర్ దీపికా పల్లికల్ ని ట్రైన్ చేస్తున్నారు.
దీపికా పల్లికల్, ట్రైనర్ కలిసి దినేష్ కార్తీక్ ని మెల్లగా మాట్లాడించడం మొదలుపెట్టారు. దినేష్ కార్తీక్, దీపికా కలిసి వర్కౌట్ చేసేవారు. తర్వాత మురళీ విజయ్ ఆట తీరు నిరాశపరచడంతో మెల్లగా ఇండియన్ టీం నుండి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుండి తప్పుకున్నారు. దీపికా పల్లికల్ ప్రోత్సాహంతో దినేష్ కార్తీక్ మళ్లీ ఆడటం మొదలుపెట్టారు. డొమెస్టిక్ మ్యాచ్ లలో మంచి స్కోరు చేశారు. ఇండియాకి వైట్ బాల్ క్రికెట్ కి ఎంపికయ్యారు. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్ అయ్యారు.
తర్వాత దినేష్ కార్తీక్, దీపికా పెళ్లి చేసుకున్నారు. కొద్ది సంవత్సరాలకి రిషబ్ పంత్ దినేష్ కార్తీక్ స్థానం తీసుకున్నారు . అప్పుడు కార్తీక్ రిటైర్ అయిపోయి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడదామని అనుకున్నారు. అప్పుడు దీపికా గర్భవతిగా ఉన్నారు. వారికి కవల పిల్లలు పుట్టారు. దీపికా కూడా ఆడటం మానేశారు. దినేష్ కార్తిక్ కి ఒక విలాసవంతమైన ఇల్లు కొనుక్కోవాలి అనే కల ఉండేది. ఆ అవకాశం ఒకసారి వచ్చింది.
అప్పుడు దీపికా, దినేష్ కార్తీక్ ని ఇల్లు కొనమని, ఇద్దరూ కలిసి మళ్లీ కెరీర్ ప్రారంభిద్దాం అని అన్నారు. మళ్లీ ఇద్దరూ కలిసి ట్రైన్ అవ్వడం మొదలు పెట్టారు. అప్పుడు వారు ఆ ఇల్లు కొనుక్కున్నారు. దినేష్ కార్తీక్ కి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుండి కాల్ వచ్చింది. అప్పుడు ధోని, దినేష్ కార్తీక్ వికెట్ కీపర్ గా ఉండాలి అనుకున్నారు. 2022 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దినేష్ కార్తీక్ ని దక్కించుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దినేష్ కార్తీక్ ని కొనుగోలు చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ డెవాన్ కాన్వేని కొనుగోలు చేసి సరిపెట్టుకుంది. డెలివరీ అయ్యి 6 నెలలు అయిన తర్వాత దీపికా మళ్లీ స్క్వాష్‌లో గ్లాస్గోలో ప్రపంచ ఛాంపియన్షిప్ ఆడారు. ఇందులో జోష్న చిన్నప్పతో కలిసి మిక్స్డ్ డబుల్స్ మరియు మహిళల డబుల్స్ రెండింటినీ గెలిచారు. దినేష్ కార్తీక్ కూడా RCB కోసం కీలకమైన మ్యాచ్‌లను ఆడారు. ఇప్పుడు రిటైర్ అయిన ఎంఎస్ ధోని స్థానంలో స్థానంలో ఫినిషర్‌గా T20 వరల్డ్ కప్ జట్టులోకి రావాలని అనుకుంటున్నారు.
End of Article