నిన్న మ్యాచ్ లో అంపైర్ తెలుగు లో మాట్లాడిన వీడియో వైరల్

నిన్న మ్యాచ్ లో అంపైర్ తెలుగు లో మాట్లాడిన వీడియో వైరల్

by Anudeep

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడా తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో శుభమన్ గిల్ (26: 17 బంతుల్లో 4×4), నితీశ్ రాణా (87: 61 బంతుల్లో 10×4, 4×6) ఇన్నింగ్స్ ప్రారంభించారు. తర్వాత వచ్చిన సునీల్ నరైన్ (7: 7 బంతుల్లో 1×6), రింకు సింగ్ (11: 11 బంతుల్లో 1×4), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (15: 12 బంతుల్లో 2×4) స్కోర్ చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 172 పరుగుల స్కోర్ చేసింది.చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్లు రుతు రాజ్ గైక్వాడ్ (72: 53 బంతుల్లో 6×4, 2×6), షేన్ వాట్సన్ (14: 19 బంతుల్లో 1×4, 1×6) మొదటి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత అంబటి రాయుడు (38: 20 బంతుల్లో 5×4, 1×6) స్కోర్ చేశారు. తర్వాత వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ (1: 4 బంతుల్లో) చేయగా, రవీంద్ర జడేజా (31 నాటౌట్: 11 బంతుల్లో 2×4, 3×6) చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 178/4 స్కోర్ చేసింది.

Video Advertisement

ఇది ఇలా ఉండగా నిన్న మ్యాచ్ మధ్యలో అంపైర్ తెలుగు లో మాట్లాడి అందరిని ఆశ్చర్య పరిచాడు ..ఇన్నింగ్ 19వ ఓవర్‌ లోచెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ సామ్ కుర్రమ్ ఇన్నింగ్ 19వ ఓవర్‌ను వేశాడు,ఆ ఓవర్ నాలుగో బంతిని దినేష్ కార్తీక్ ఎదుర్కొన్నాడు. అతనికి బాల్ అందకుండా వికెట్లకు కాస్త దూరంగా వెళ్ళింది,అప్పుడు దినేష్ కార్తీక్. `అంపైర్.. ఇది వైడా?` అని ప్రశ్నించాడు. దీనికి అంపైర్తె లుగులోనే షంషుద్దీన్ సమాధానం ఇచ్చాడు. `లోపల..చానా లోపల. కొంచెం గూడ కాదు..అంటూ బదులిచ్చాడు. సోషల్ మీడియా లో అంపైర్ తెలుగు మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది.మీరు కూడా చుడండి

 


End of Article

You may also like