జబర్దస్త్ కార్యక్రమం వల్ల ఎంతోమంది కమెడియన్లకి లైఫ్ వచ్చింది. ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమదైన శైలిలో నవ్వించి సత్తా చూపించారు. చాలామంది కమెడియన్లకు ఈ షో ప్రాణంగా నిలిచింది కూడా. అయితే ఇలా మనల్ని నవ్వించే కమెడియన్ల జీవితాల్లో కూడా బాధ ఉంటుందని మనకు తెలిసిందే.

Video Advertisement

 

 

ఇప్పుడు కూడా జబర్దస్త్ కమెడియన్లలో ఒకరి లైఫ్‌లో ఇలాంటి విషాదమే ఉంది. అతడే పంచ్ ప్రసాద్. వెంకీ మంకీస్ టీంలో తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేసి నవ్విస్తుంటాడు ఈయన. కొంతకాలం కిందట పంచ్ ప్రసాద్ కి రెండు కిడ్నీలు దాదాపు 80 శాతం పాడైపోయాయి. అప్పుడు నాగబాబు, రోజా తో సహా పలువురు కమెడియన్లు సాయం చేసారు. తర్వాత కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ కామెడీ టైమింగ్ తో నవ్విస్తున్నాడు ప్రసాద్.

 

ప్రస్తుతం పంచ్ ప్రసాద్ రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం ఇంకా మెరుగపడలేదు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పాల్గొన్న పంచ్ ప్రసాద్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “నాకు ఆరోగ్యం బాగా లేనప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులు, నాగబాబు, రోజా గారు చాలా సహాయం చేసారు. కిరాక్ ఆర్పి గారు కూడా లక్ష రూపాయల సాయం చేసారు. నూకరాజు కూడా చాలా సహాయం చేసారు.

jabardasth punch prasad about his wife..!!

నాకు లెగ్ ఇన్ఫ్‌క్షన్, థైరాయిడ్ కూడా ఉన్నాయి. అందుకే ఆపరేషన్ అంటే భయపడ్డాను. లెగ్ ఇన్ఫెక్షన్ తగ్గినా తర్వాత సర్జరీ చేస్తామని డాక్టర్లు అన్నారని అంతవరకు వెళ్లకుండా మెడిసిన్స్ తోనే తగ్గాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. నా లైఫ్ ఇలా ఉన్నాసరే నా భార్య నాకు అండగా నిలబడింది. అసలు నా భార్య లేకపోతే నేను 5 సంవత్సరాల క్రితమే చనిపోయేవాడిని..” అంటూ భావోద్వేగానికి గురయ్యారు పంచ్ ప్రసాద్.

jabardasth punch prasad about his wife..!!

తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను, తన అనారోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన పంచుకుంటూ ఉంటారు. జబర్దస్త్ తో పాటు మల్లెమాల సంస్థ నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతి రత్నాలు వంటి షోస్ ద్వారా పంచ్ ప్రసాద్ మంచి పేరు సంపాదించాడు. అయితే ఆయన అనారోగ్యం మీద కూడా కొందరు కమెడియన్లు షోస్ లో కామెడీ చేస్తూ ఉంటే దాన్ని కూడా పంచ్ ప్రసాద్ చాలా సీరియస్గా తీసుకోకుండా సరదాగా తీసుకుంటూ ఉంటారు.

Also read: హీరోయిన్ శ్రీలీల “చైల్డ్ ఆర్టిస్ట్” గా నటించారా..? ఏ సినిమాలో అంటే..?