కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ 2021లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా కింగ్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ కీరన్ పొలార్డ్, టీమ్ సీఫెర్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు. మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.. కెప్టెన్ కీరన్ పొలార్డ్, టీమ్ సీఫెర్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఐదవ బంతిని పాకిస్తాన్ పేసర్ వాహబ్ రియాజ్ వేయగా.. సీఫెర్ట్ ఎదుర్కొన్నాడు..

పూర్తిగా ఆఫ్ సైడ్ వెళ్లిన ఆ బంతిని సీఫెర్ట్ కిందపడి మరి ఆడినా కూడా అందలేదు.అది వైడ్ బాల్ అని అందరికి తెలుస్తుంది కానీ ఫీల్డ్‌ అంపైర్ నిగెల్ డుగుయిడ్ వైడ్ ఇవ్వలేదు ..అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో.. నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న పొలార్డ్  వికెట్లకు దూరంగా నడుచుకుంటూ వెళ్లి తన నిరసన వ్యక్తం చేశాడు.మొత్తానికి ఫాన్స్ అంపైర్లపై మండిపడుతున్నారు.ఈ  వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. . లక్ష్య ఛేదనలో సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 131 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.