రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది టాలీవుడ్ లో విడుదలైన ఏ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేదు. టాలీవుడ్ లో వరుస పరాజయాలకు `లైగర్` బ్రేక్ వేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశలు పెట్టుకొన్నాయి.
మరోవైపు.. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ప్రముఖ అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్ కూడా నటించిన సంగతి తెలిసిందే. మైక్ టైసన్‌కీ ఈ కథకీ ఉన్న సంబంధం ఏమిటి? తను అసలు ఈ కథలోకి ఎలా వస్తాడు? అనే ఆసక్తి మొదలైంది.
Also Read: “దీనమ్మా ఇదెక్కడి మోసం పూర్ణ మావా?” … మజిలీలో ఇది ఎప్పుడూ గమనించలేదే.!
Liger Movie Story
ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ.. మైక్ టైసన్ అభిమానిగా కనిపించబోతున్నాడట. టైసన్‌తో ఎప్పటికైనా ఓ సెల్ఫీ తీయించుకోవాలన్నది `లైగర్` డ్రీమ్. అంతటి అభిమాని అయిన లైగర్.. చివరికి క్లైమాక్స్ ఫైట్ లో.. టైసన్‌తోనే తలపడి, తనని అంతమొందిస్తాడంట. నిర్జీవంగా పడుకొన్న టైసన్‌ని ఒళ్లో పడుకోబెట్టుకొని.. అప్పుడు ఓ సెల్ఫీ తీసుకుంటాడట హీరో విజయ్. అలా.. తన కలని నిజం చేసుకుంటాడు. ఇందులో మదర్ సెంటిమెంట్ ని కూడా బలంగా చూపించబోతున్నాడట డైరెక్టర్ పూరి.
Also Read: ఈ చెడ్డ పేరు మీకు ఎందుకు “మహేష్” గారూ..? కొంచెం ఆలోచించవచ్చు కదా..?

Liger Movie Story
ఇది వరకు `అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి`లో మదర్ సెంటిమెంట్ చూపించాడు పూరీ. అది కూడా బాక్సింగ్ కథే. అందుకే ఈ రెండు సినిమాలకూ పోలిక తీసుకొస్తున్నారు సినీ అభిమానులు. చూడాలి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో.. ఆగస్ట్ 25న లైగర్ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ పై దృష్టి పెట్టింది చిత్ర బృందం. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.