మీరు మందులు వేసుకునేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా..? అయితే మందులు పనిచేయవట.!

మీరు మందులు వేసుకునేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా..? అయితే మందులు పనిచేయవట.!

by Anudeep

Ads

మనం టాబ్లెట్ ఎలా వేసుకుంటాం..? గ్లాస్ వాటర్ తో టాబ్లెట్ వేసుకుంటాం. కానీ కొంతమంది టీ కాఫీలతో, జ్యూస్ లతో కూడా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా వేసుకోకూడదట. అసలు టాబ్లెట్ ను ఎలా వేసుకోవాలి..? ఎలా వేసుకుంటే పని టాబ్లెట్ సక్రమం గా పనిచేస్తుంది ..? అనేది ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

medication 1

చాలామంది చల్లని నీటితో లేదా రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ తో టాబ్లెట్ ను వేసుకుంటూ ఉంటారు. చల్లని నీటితో వేసుకోవడం వలన ఫలితం కనిపించదు. మాములు నీటితో అయితే టాబ్లెట్ పూర్తి గా కరగడానికే 40 నిమిషాల సమయం పడుతుంది. అలాగే.. అది ఫలితం చూపించడానికి కనీసం నాలుగైదు గంటలు కనబడుతుంది. దీనికంటే.. గోరు వెచ్చటి నీటితో టాబ్లెట్ వేసుకోవడం శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు.

medication 3

ఇటీవల జరిగిన ఓ సర్వే లో కొందరికి మాములు నీటితోను, మరికొందరికి గోరు వెచ్చని నీటితోను టాబ్లెట్ ఇచ్చారట. అయితే మాములు నీటితో టాబ్లెట్ వేసుకున్న వారికంటే, గోరు వెచ్చని నీటితో టాబ్లెట్ వేసుకున్న వారికి తొందరగా ఫలితం కనిపించింది. అలాగే.. కొందరు కాఫీ లేదా, టీ తో వేసుకుంటూ ఉంటారు. అవి వేడిగా ఉండడం వలన తొందరగా టాబ్లెట్ కరుగుతుంది భ్రమిస్తారు. కానీ ఇది అస్సలు మంచిది కాదు. కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి.

medication 1

అలాగే.. చిన్న పిల్లలు టాబ్లెట్ వేసుకోవడానికి ఇష్టపకపోతే.. వారికి పాలల్లోనో.. బాదం మిల్క్ లోనో టాబ్లెట్ ను కలిపేసి ఇస్తుంటారు. ఇలా ఇవ్వడం కూడా మంచిది కాదు. కొన్ని టాబ్లెట్స్ ను పాలల్లో కలపడం వలన అవి తమ శక్తిని కోల్పోతుంటాయి. ఉబ్బసం వంటి వ్యాధులు రావడానికి కారణం అవుతాయి. మరికొందరు జ్యూస్ లతో తీసుకుంటూ ఉంటారు. టాబ్లెట్స్ చక్కర పదార్ధాలతో కలవడం వలన వాటి సహజ లక్షణాన్ని కోల్పోతాయి. అందుకే అది మంచి పధ్ధతి కాదు. టాబ్లెట్స్ ను కేవలం గోరు వెచ్చని నీటితో మాత్రం తీసుకోవడం మంచిది.


End of Article

You may also like