Ads
Naga Chaitanya Upcoming and Latest Movie Details: అక్కినేని నాగ చైతన్య హీరోగా, దర్శకుడు చందూ మొండేటి ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ బన్ని వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
Video Advertisement
మత్స్యకారుల నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఈ మూవీ యూనిట్ ఇటీవలే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో కె.మత్స్యలేశం ఊరిని సందర్శించించి, అక్కడి మత్స్యకార కుటుంబాలతో మాట్లాడిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమా స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
నాగ చైతన్య ఇటీవల నటించిన కస్టడీ మూవీ నిరాశపరిచింది. తరువాత తనకు ప్రేమమ్ మూవీతో హిట్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటితో సినిమాను ప్రకటించారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మత్స్యకార యువకుడిగా నాగ ఛైతన్య నటిస్తున్నారు.
సముద్రంలో చేపల్ని వేటాడే బోట్ డ్రైవర్ పాత్రలో నాగ ఛైతన్య నటిస్తున్నారని తెలుస్తోంది. ఇది యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ అని సమాచారం. 2018లో గుజరాత్ విరావల్ నుండి చేపల కోసం వేటకు వెళ్ళిన 21 మంది మత్స్యకారులను పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపడంతో పాక్ చెరనుండి ఆ మత్స్యకారులు బయటబడ్డారు. ప్రస్తుతం ఆ స్టోరీని ఆధారంగా తీసుకునే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
పాక్ కోస్ట్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్న మత్స్యకారుల్లో కె మత్స్యలేశంకు చెందిన మత్స్యకారుడు గణగల్ల రామరావు ఒకరు. గుజరాత్ నుండి సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళిన రామరావు పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు చిక్కి, పాకిస్థాన్ లో రెండు సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపాడు. అక్కడి నుండి ఎలా బయటికి వచ్చాడు అనే కథ ఆధారంగానే చందూ మొండేటి ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్ళి, మత్స్యకారులతో మూవీ యూనిట్ చర్చించారు. ఆ ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
https://www.instagram.com/p/CvurD9KJQ7_/
Also Read: “పుష్ప” టీమ్ ని ట్రోల్ చేస్తున్న నెటిజెన్లు..! కారణం ఏంటంటే..?
End of Article