OTT లోకి “నాగ చైతన్య” కస్టడీ..! ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

OTT లోకి “నాగ చైతన్య” కస్టడీ..! ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

by kavitha

Ads

అక్కినేని నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించిన చిత్రం కస్టడీ. ఈ సినిమాలో నాగచైతన్య కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ మే 12న తెలుగు, తమిళంలో విడుదల అయ్యింది.

Video Advertisement

నాగచైతన్యకు ఇది తొలి తమిళ సినిమా అని చెప్పవచ్చు. ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రంకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అయితే ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్ గురించిన వార్తలు వస్తున్నాయి. అయితే ఏ ఓటీటీలో ఎప్పుడు ఈ మూవీ రిలీజ్ కానుందో ఇప్పుడు చూద్దాం..
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రంలో కానిస్టేబుల్ శివగా నాగ చైతన్యనటించారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో విలన్‌గా నటించగా, శరత్‌కుమార్, సంపత్ రాజ్‌, YG మహేంద్రన్ కీలక పాత్రలలో నటించారు.  శివ గర్ల్ ఫ్రెండ్ రేవతి పాత్రలో కృతి శెట్టి, ముఖ్యమంత్రి పాత్రలో ప్రియమణి నటించారు. ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారుశివ (నాగచైతన్య) నిజాయితీగల పోలీస్ కానిస్టేబుల్ గా సీఎం దాక్షాయణి (ప్రియమణి) ప్రశంసలు పొంది జిల్లాలో చాలా పాపులర్ అవుతాడు. ఓ రోజు రాత్రి పూట డ్యూటీలో చేస్తూ ఎవరో తెలియకుండానే పెద్ద క్రిమినల్ అయిన రాజు  (అరవిందస్వామి)  మరియు సిబిఐ ఆఫీసర్ అయిన జార్జ్ (సంపత్ రాజ్) లను అరెస్ట్ చేస్తాడు. ఆ సంఘటనతో సాధారణ కానిస్టేబుల్ అయిన శివ లైఫ్ తలకిందులవుతుంది. రాజూ ఎవరు? అతడిని ఎందుకు సిబిఐ పట్టుకోవాలని  అనుకుంటుంది? ఇందులో శివ ఎందుకు ఇరుక్కున్నాడు? ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథ.
తాజాగా కస్టడీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. సాధారణంగా ఏ చిత్రం రిలీజ్ అయినా 45 రోజుల తరువాతనే ఓటీటీలోకి వస్తుంది. అంటే ఈ సినిమా మే 12న రిలీజ్ అయింది. అంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా జూన్ చివర్లో ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుందని సమాచారం. అయితే థియేటర్స్ లో చూడని చాలా మంది ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా ఈ మధ్య చాలా చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ అయినపుడు వచ్చే టాక్  కన్నా ఓటీటీలో విడుదల అయిన తరువాత మంచి టాక్ వస్తుంది. మరి ఈ సినిమాకి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

Also Read: పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ “బ్రో” తో పాటు… ఒకే “టైటిల్” తో వచ్చిన 15 సినిమాలు..!


End of Article

You may also like