పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ “బ్రో” తో పాటు… ఒకే “టైటిల్” తో వచ్చిన 15 సినిమాలు..!

పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ “బ్రో” తో పాటు… ఒకే “టైటిల్” తో వచ్చిన 15 సినిమాలు..!

by Anudeep

Ads

సినిమా జనాలకి ఎక్కువగా రీచ్ అవ్వాలి అంటే టైటిల్ అనేది చాలా ముఖ్యం. ఒక సినిమా పేరు ఎంత క్యాచీగా ఉంటే ప్రేక్షకుల దృష్టిలో అంత ఈజీగా పడుతుంది. అందుకే సినిమా టైటిల్స్ చాలా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటారు. అలాగే టైటిల్ సినిమా కథకు తగ్గట్టు ఉండడం కూడా ఎంతో ముఖ్యం.

Video Advertisement

అయితే కొన్ని సార్లు కథకు తగ్గ టైటిల్ ని పాత హిట్ సినిమాల నుంచి తీసుకున్నారు మేకర్స్… చాలా మంది హీరోలు పాత సినిమాల టైటిల్స్‌ను తమ సినిమాలకు పెడుతూ.. ఆయా సినిమాలపై క్రేజ్ తీసుకొచ్చే పనిలో పడ్డారు. అందులో కొంత మంది పాత సినిమాల క్లాసిక్ టైటిల్స్‌ను చెడగొట్టారు. కొందరు హిట్టు కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆ సినిమాలేవో చూద్దాం..

#1 ఖుషి

హీరోగా పవన్ కళ్యాణ్‌ రేంజ్‌ను పెంచిన మూవీస్‌లో ‘ఖుషీ’ ఒకటి. ఈ సినిమా టైటిల్‌తో ఇపుడు విజయ్ దేవరకొండ, సమంత చిత్రం రాబోతోంది. ఖుషీ టైటిల్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచారు.

list of telugu movies which have same titles
#2 తొలి ప్రేమ

పవన్ కళ్యాణ్‌కు హీరోగా బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘తొలి ప్రేమ’. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అప్పటి యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీ టైటిల్‌తో పవన్ కళ్యాణ్ అన్న కుమారుడు వరుణ్ తేజ్.. సినిమా చేసి హిట్ అందుకున్నాడు.

list of telugu movies which have same titles

#3 సుల్తాన్

నందమూరి నట సింహా బాలకృష్ణ నటించిన సుల్తాన్ మూవీ టైటిల్‌తో కార్తి హీరోగా వచ్చిన ఈ మూవీ అంతగా అలరించ లేకపోయింది.

list of telugu movies which have same titles

#4 బంగారు బుల్లోడు

బాలకృష్ణ పాత సూపర్ హిట్ ‘బంగారు బుల్లోడు’ టైటిల్‌తో అల్లరి నరేష్ సినిమా చేసాదు. ఈ సినిమాతో అల్లరి నరేష్ బాక్సాఫీస్ దగ్గర మరో డిజాస్టర్‌ను అందుకున్నాడు.

list of telugu movies which have same titles

#5 శ్రీమంతుడు

అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు ’శ్రీమంతుడు’ సినిమాతో సక్సెస్ అందుకుంటే.. ఆ తర్వాత చాలా యేళ్లకు మహేష్ బాబు అదే టైటిల్‌తో సూపర్ హిట్ అందుకున్నాడు.

list of telugu movies which have same titles

#6 స్వాతి ముత్యం

కళా తపస్వీ కే విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ఆల్ టైమ్ హిట్ మూవీ ‘స్వాతి ముత్యం’ . ఈ సినిమాలో అమాయకుడి పాత్రలో కమల్ నటనను ఎవరు మరిచిపోలేరు. గతేడాది అదే ’స్వాతి ముత్యం’ టైటిల్‌తో బెల్లంకొండ సురేష్ బాబు రెండో తనయుడు బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా సినిమా చేసాడు.

list of telugu movies which have same titles

#7 వారసుడు

ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున హీరోలుగా నటించిన ’ వారసుడు’ మూవీ హిట్ అయ్యింది. ఇక తాజాగా కోలీవుడ్ హీరో విజయ్ కూడా ‘వారసుడు’ గా ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

list of telugu movies which have same titles

#8 విక్రమ్

కమల్ హాసన్ హీరోగా నటించిన మూవీ ‘విక్రమ్’ మూవీ కూడా నాగార్జున హీరోగా నటించిన విక్రమ్ మూవీ టైటిల్ నే తీసుకున్నారు.

list of telugu movies which have same titles

#9 గాడ్ ఫాదర్

ఏఎన్నార్, వినోద్ కుమార్ హీరోలుగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో గతంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా వచ్చింది. చాలా సంవత్సరాలకు అదే టైటిల్‌తో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీతో పలకరించారు.

list of telugu movies which have same titles

#10 మహర్షి

వంశీ దర్శకత్వంలో 90 దశకంలో వచ్చిన మూవీ ‘మహర్షి’. మ్యూజికల్‌గా పెద్ద హిట్టైయిన ఈ సినిమా టైటిల్‌తో చాలా యేళ్ల తర్వాత మహేష్ బాబు సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.

list of telugu movies which have same titles

#11 సర్ధార్

80లలో రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా సర్థార్ సినిమా తెరకెక్కింది. కార్తి మరోసారి అదే ‘సర్ధార్’ టైటిల్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.

list of telugu movies which have same titles

#12 బ్రో

అవికా గోర్ , నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం బ్రో. తాజాగా ఇదే టైటిల్ తో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మూవీ రాబోతుంది.

memes on pavan kalyan's bro movie title..

#13 ఆడవాళ్లు మీకు జోహార్లు

శర్వానంద్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా ఒకప్పటి కృష్ణంరాజు, చిరంజీవి హీరోలుగా కే.బాలచందర్ దర్శకత్వలో తెరకెక్కిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టైటిల్‌తో తెరకెక్కింది.

list of telugu movies which have same titles

#14 శ్రీరస్తు శుభమస్తు

చిరంజీవి హీరోగా నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ టైటిల్‌తో అల్లు శిరీష్ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.

list of telugu movies which have same titles

#15 మాస్టర్

చిరంజీవి పాత సూపర్ హిట్ ‘మాస్టర్’ టైటిల్‌తో సూపర్ హిట్ అందుకున్నారు విజయ్.

list of telugu movies which have same titles

ఈ లిస్ట్ లో మిస్సమ్మ, మాయాబజార్, ఇద్దరు మిత్రులు, దొంగ, కాష్మోరా, చినబాబు, హీరో, ఖైదీ, గ్యాంగ్ లీడర్ వంటి ఎన్నో చిత్రాలు ఉన్నాయి.

End of Article

You may also like