‘గీతా ఆర్ట్స్’ బ్యానర్‌లో గీత పేరు వెనక కథ చెప్పిన అల్లు అరవింద్..!!

‘గీతా ఆర్ట్స్’ బ్యానర్‌లో గీత పేరు వెనక కథ చెప్పిన అల్లు అరవింద్..!!

by Anudeep

Ads

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అరవింద్. ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమారుడిగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన అల్లు అరవింద్.. 1974లో గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాత అయ్యారు. ఇప్పటికీ నిర్మాతగా, స్టూడియో అధినేతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఆహా ఓటీటీ అధినేతగా అప్రతిహతంగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు.

Video Advertisement

 

ఈయన గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. బలమైన కథాకథనాలు .. కొత్తదనం కలిగిన సినిమాలు ఈ బ్యానర్లో వస్తాయనే ఒక నమ్మకం జనంలో ఉంది. బ్యానర్ చూసి జనం థియేటర్లకు వెళ్లే జాబితాలో గీతా ఆర్ట్స్ కూడా ఉంటుంది. అయితే అసలు ఈ ‘గీత’ ఎవరు? అల్లు ఫ్యామిలీలోనే ‘గీత’ అనే పేరు కలిగినవారు ఎవరూ లేరు కదా, మరి ఎవరి పేరుతో ఈ సంస్థను స్థాపించినట్టు? అనే ఒక కుతూహలం చాలామందిలో ఉంది. ఈ విషయానికి సంబంధించిన ప్రశ్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో అల్లు అరవింద్ కి ఎదురైంది.

who is geetha in geetha arts banner.. allu arvind revealed..
అందుకు ఆయన స్పందిస్తూ .. ‘గీత’ అనేది నా గర్ల్ ఫ్రెండ్ అనే డౌటు చాలామందికి ఉంది. కానీ నిజానికి ‘గీతా ఆర్ట్స్’ అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థను పెడదామనే ఒక ప్రపోజల్ ను పెట్టింది మా నాన్నగారు. భగవద్గీత లో ప్రయత్నం మాత్రమే మనది .. ఫలితం మన చేతిలో లేదు అనేది సారాంశం. అది సినిమాకి కరెక్టుగా సరిపోతుంది. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే .. ఫలితం ప్రేక్షక దేవుళ్ల చేతిలో ఉంటుంది. ‘గీత’కి దగ్గరగా ఉండటం వలన ‘గీతా’ ఆర్ట్స్ అని పెడదామని నాన్నగారు అనడం .. అదే ఫైనల్ అయ్యింది అని అల్లు అరవింద్ వెల్లడించారు.

who is geetha in geetha arts banner.. allu arvind revealed..
మధ్యలో ఆలీ కల్పించుకొని .. పెళ్లైన తర్వాత నిర్మలా ఆర్ట్స్ పేరు పెట్టవచ్చు కదా అని సరదాగా అడిగారు. దీనికి అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అప్పటికే ఈ బ్యానర్‌లో పలు సిల్వర్ జూబ్లీ సినిమాలు తెరకెక్కాయి. అందుకే పేరు మార్చాలన్న ఆలోచనే రాలేదన్నారు. మరోవైపు తాను చదువకునే రోజుల్లో తనకు గీత అనే పేరుతో ఓ ఫ్రెండ్ ఉందనే విషయాన్ని ప్రస్తావించారు. నా ఫ్రెండ్స్ నన్ను ఆ పేరుతో ఆటపట్టించే వారంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు అల్లు అరవింద్.

who is geetha in geetha arts banner.. allu arvind revealed..

ఇక గీతా ఆర్ట్స్ నేను నిర్మించిన దాదాపు అన్ని చిత్రాల్లో నాన్న అల్లు రామలింగయ్య గారు నటించారు. అందరిలాగే వారి మార్కెట్ ప్రకారం వాళ్లకు రెమ్యునరేషన్ ఇచ్చేవాడినన్నారు. ఇక నిర్మాతగా ఎక్కువగా తన బావగారైన చిరంజీవితోనే ఎక్కువ సినిమాలు చేసినట్టు చెప్పుకొచ్చారు.


End of Article

You may also like