మొన్నామధ్య ఫ్రస్టేటెడ్ ఉమన్, ఫ్రస్టేటెడ్ మదర్ అంటూ రకరకాలుగా సునయన వీడియోలు యూట్యూబ్ లో హల్ చల్ చేశాయి .. నిజానికి ఇప్పుడు అందరి ఉమన్స్ పరిస్థితి ప్రస్ట్రేషన్లోనే ఉండి చచ్చింది. ఇంకేం మిగిలిందని జీవితానికి.. లాక్ డౌన్ కాదు కానీ మొత్తానికి దీని వల్ల స్త్రీలకు రెండింతలు పని పెరిగిందని మొన్న ఏదో సర్వేలో కూడా రాసి తగలడ్డారు కదా.. ముందే చెప్తున్నా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాను..ప్రస్ట్రేషన్ అండీ ఫ్రస్ట్రేషన్..

Video Advertisement

లాక్ డౌన్ కి ముందు ఉదయాన్నే లేచి ఏదో ఉన్నది వండి  పతిదేవుడికి,పిల్లలకి ఇంత పెట్టి వాళ్లని ఎక్కడి వాళ్లని అక్కడ పంపేస్తే ..తనింత తిని, ఏదో కొద్ది సేపు రెస్టు..కొద్ది సేపే సుమా.. పోనీ ఏ రోజైనా లేట్ గా లేచినా, పోనీ అలసట గా ఉన్న రోజైనా ఏముంది జై స్విగ్గీ.. బ్రేక్ ఫాస్ట్ దగ్గర మొదలుపెడితే, మద్యాహ్నం రైస్ కుక్కర్ లో ఇంత రైస్ పడేస్తే కర్రీ పాయింట్ మన కోసం తెరిచే ఉంటుంది, సాయంత్రం స్నాక్స్ , నైట్ డిన్నర్ బయటే కానిచ్చేసి ,ఇంటిల్లిపాది కాళ్ల చాపుకుని పడుకుంటే అయ్పాయ్..

కానీ ఇప్పుడో పొద్దున లేవగానే బ్రేక్ ఫాస్ట్ దగ్గర మొదలెట్టి అవి కంప్లీట్ కాగానే , మద్యాహ్నం లంచ్ ఏం వండాలా అని జుట్టు పీక్కుని వండి వడ్డించి, అంతా అయ్యాక ఇంత కునుకు తీద్దామంటే సాయంత్రం స్నాక్స్ కి ఇప్పటి నుండి ప్రిపేర్ అయితే తప్ప అప్పటికి తెమలదు..అవి పొయి మీద వి పొయి మీద అవుతూనే ఉంటే కడుపులోకి పోతూనే ఉంటాయి.. కాగానే డిన్నర్.. అంతా ముగించుకుని పడుకునే సరికి ఏ పదకొండో..ఇంత చేసినా సోషల్ మీడియా ఓపెన్ చేయగానే రకరకాల వంటలు, అమ్మా ఇవి చేయవా రేపు అంటూ పిల్లలు..దీనమ్మా వంటలు అని తిట్టాలనపిస్తుంది..కాని సంస్కారం అడ్డొచ్చి .. బూతులు నోట్లోనే మింగేయాల్సొస్తుంది.

కరోనా కాలం అని పని వాళ్లకి వద్దని చెప్పాం కదా..చచ్చినట్టు ఆ పని కూడా మన ఖాతాలోనే.. ఇంటిల్లిపాది రోజంతా హాయిగా తిని కూర్చుంటే అవుతుందా.. సింకులో గిన్నెలు మనల్నే చూస్తూ పల్లికిలిస్తుంటాయి..వాటిని పలకరించి కొంచెం బరువు దించుకునే లోపు మా సంగతెవడు చూస్తాడు అంటూ బట్టలు రెడీ గా ఉంటాయి.. అసలే సమ్మర్ రెండు సార్లు కాకపోతే నాలుగు సార్లు చేస్తారు స్నానాలు ..ఎటూ ఎసిలు గట్రా వాడట్లే కదా..ఎంత వాషింగ్ మెషిన్లో వేస్తే మాత్రం వాటిని ఎవడు ఆరేయాలి, ఎవడు మడత పెట్టాలి..

వీటన్నింటికి తోడు ఏ పనైనా చేయడానికి ముందు, చేసిన తర్వాత చేతులు రుద్దుడే రుద్దుడే.. ఇవన్ని ఒకెత్తు మనం వండినవి తింటూ, మనం చేసే పనులకి వంక పెడుతూ, మనం ఇల్లు ఊడుస్తుంటే చీపురు మద్యలో లాక్కుని ఒక ఫోటో దిగి వాటిని సోషల్ మీడియాలో లాక్ డౌన్ డైరీస్ అంటూ అప్లోడ్ చేస్తుంటే కడుపు మండిపోతుంటుంది.. అప్కోర్స్ మనకి కూడా లేని నవ్వుని అరువు తెచ్చుకుని ఫోటోలు పెట్టక తప్పదు.. సోషల్ మీడియా జీవితంలో ఒక భాగం కదా..

మీరు  మీ ఫ్యామిలికి చేయండి నేనేం వద్దనట్లేదు..కాని ముందు మీరు మీ హెల్త్ చూస్కోండి..మీ ఇంటికి మీరే మెయిన్ వికెట్ మీరు బాగుంటేనే మీ ఫ్యామిలి బాగుంటుంది..ఇంకో ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోండి. మీరు అంత హడావిడిగా తిండి మానేసి చేయాల్సిన పనులేవి ఉండవు.. ఆ పని ఈ క్షణం అయినా, ఈ రోజైనా , రేపైనా మీరే చేస్కోవాలి..ఎవరో ఒకరిద్దరు  ఉంటారు క్షేమంగా వెళ్లి లాభంగా రండి లో ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు.. వాళ్లు కూడా బాద్యతగా ఫీలవ్వరు, భార్యకి సాయం చేస్తున్నాం అన్నట్టుగా ఫీల్ అవుతారు.. అదేంటో అర్దం కాదు.. ఇంటి పనుల్ని పంచుకునే భర్త, పిల్లల్ని నేను ఏం అనట్లేదు.. ఈ లాక్ డౌన్ వేళ్లలో ఇన్ని పనులు స్తంభించిపోయాయి కాని ఇంట్లో అమ్మ పని మాత్రం ఆగలేదు.. అర్దం చేస్కుంటారని ఆశిస్తూ..