2021 లో విడుదల అయిన మా ఊరి పొలిమేర సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా పొలిమేర 2. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.

Video Advertisement

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్ల సునామీని సృష్టించింది. అయితే పార్ట్ 1 లో మర్డర్ మిస్టరీకి చేతబడి అంశాన్ని జత చేసి తిరకెక్కించిన అనిల్ విశ్వనాథ్ పార్ట్ -2 లో అన్నింటిని రివీల్ చేశారు.

polimera 2 temple real story

ఇకపోతే అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాలో ఉన్న ఏకపాద మూర్తి గుడికి సంబంధించి అనేక రకాల వార్తలు కథనాలు కూడా వినిపించాయి. మరి ఆ గుడికి సంబంధించిన విషయాల గురించి దాని వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఏకపాదమూర్తి గుడికి, కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికి లింక్‌ ఉందని అక్కడ నిధులు కూడా ఉన్నాయని కొమిరి చేసే క్షుద్రపూజల వల్ల వాటిని సొంతం చేసుకోవచ్చని ఇలా ఒక మంచి కథాంశంతో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు అనిల్.

polimera 2 temple real story

కాగా సినిమాలో ఆ గుడి జాస్తి పల్లిలో ఉందని చెప్పిన విషయం తెలిసిందే. కానీ గుడి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా గండికోట దగ్గర ఉంది. ఇది 16వ శతాబ్దపు హిందూ దేవాలయం. అప్పట్లో కృష్ణుడి ప్రతిమ ఉండేదట. కాగా ఆ ఆలయాన్ని మాధవ పెరుమాళ్ ఆలయం లేదా మాధవరాయ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. అంతే కాకుండా భారతప్రభుత్వం ఆ గుడిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా కూడా గుర్తించింది. ఈ గుడిలో ఎన్నో తెలుగు సినిమాలకు సంబంధించి షూటింగులు కూడా జరిగాయి.

maa oori polimera 2 movie review

ఇకపోతే ఆలయంలో ఉన్న నిర్మాణాన్ని బట్టి చూస్తే అది 16వ శతాబ్దం మొదటి త్రైమాసికంలో నిర్మించినట్టుగా అర్థమవుతోంది. అలాగే ఆ ఆలయానికి సంబంధించిన తొలి ప్రస్తావన 16వ శతాబ్దపు శాసనాలలో కనుగొనబడింది. గండి కోటలో విజయనగర కాలం నాటి రాజులు నిర్మించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. 16వ శతాబ్దపు శాసనాలు ఆ గుడిలో కనుగొనబడ్డాయి. పాపా తిమ్మరాజు అనే వ్యక్తితో సహా అనేక మంది వ్యక్తులు మాధవరాయ దేవుడికి నమస్కరించి, దేవుడికి మాలను సమర్పించారని అందులో పేర్కొంది.

maa oori polimera 2 movie review

ఇకపోతే ఆ గుడిలో నిజంగానే అందరూ అనుకున్నట్టుగా నిధులు ఉన్నాయా అంటే.. ఆ గుడిలో ఉన్న విగ్రహాన్ని కడప జిల్లాలోని మైదుకూరుకు తరలించినట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయట. కానీ ఆ గుడిలో ప్రస్తుతం దేవుడు విగ్రహం లేదు. ఊరికి దూరంగా ఉండటం వల్ల అక్కడ దొంగతనాలు వంటివి జరిగే అవకాశాలు ఉంటాయని గుడికి లాక్ వేసి ఉంచడం టూరిస్టులు వెళ్లిన సమయంలో మాత్రమే ఆ గేట్లు తెరుస్తారట. ఇకపోతే ఎక్కడ స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం ఒకప్పుడు అక్కడ నిధులు ఉండేవని ఇప్పుడు ఎటువంటి నిధులు లేవని, మహమ్మదీయుల దాడుల సమయంలో వాటిని దోచుకున్నారని చెబుతున్నారు.

ALSO READ : సూపర్ స్టార్ కృష్ణ – విజయ నిర్మల పెళ్లి వెనకాల చంద్రమోహన్..? అసలు ఏం జరిగింది?