పెళ్లికి ముందు తీసుకునే ఈ కౌన్సిలింగ్ గురించి తెలుసా..? దీని వల్ల వచ్చే లాభాలు ఏంటి..?

పెళ్లికి ముందు తీసుకునే ఈ కౌన్సిలింగ్ గురించి తెలుసా..? దీని వల్ల వచ్చే లాభాలు ఏంటి..?

by Mohana Priya

Ads

ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్ ఈ పదం వినడానికి కొత్తగా ఉన్న ప్రస్తుతం ఉన్న జనరేషన్ కు రాబోయే రోజుల్లో ఇది తప్పనిసరి అయ్యే పరిస్థితి కనపడుతోంది. ఇంతకుముందు రోజుల్లో పెళ్లిళ్లు అనేది ఎంతో పవిత్రంగా భావించేవారు కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి పట్టినంత సమయం కూడా డైవర్స్ తీసుకోవడానికి పట్టడం లేదు.

Video Advertisement

పైగా డైవర్స్ తీసుకున్నామని సోషల్ మీడియాలో పబ్లిక్ గా అనౌన్స్ చేసి, అదేదో గొప్ప సంగతి లాగా పార్టీలు చేసుకునే దరిద్రపు స్థితికి ఈరోజు మన సొసైటీ చేరుకుంది.స్వేచ్ఛ వాదులు ఇది కనీసం మానవ హక్కు అని, దీనిని పై ప్రశ్నించడం పద్ధతి కాదని వాదిస్తారు కానీ వాస్తవానికి మన సంస్కృతి ఇది కాదు.

జనరేషన్స్ గడుస్తున్న కొద్ది మనిషి ఆలోచనల్లో ఎటువంటి అభివృద్ధి కలుగుతుందో పెళ్లి గురించి అబ్బాయి అమ్మాయి ఆలోచనల్లో కూడా పరస్పరం అదే రకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా వివాహానికి ముందు ఒకరినొకరు తెలుసుకోవడం ఎంతో అవసరమైంది. ఇలా పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరికి తెలియపరిచే పద్ధతిని ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్ అని అంటారు. అందుకే వివాహానికి ముందు కౌన్సిలింగ్ తో పాటుగా జీవిత భాగస్వామి నుంచి ఒకరినొకరు ఏమి ఆశిస్తున్నారు.

ఇలాంటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం జరుగుతుంది. పెళ్లి చేసుకున్నాక సర్దుబాటు చేసుకోవడం కంటే కూడా పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు సరిగ్గా అర్థం చేసుకోవడం మంచిది అనేది నేటితరం ఆలోచన.ఇటువంటి కౌన్సిలింగ్ ద్వారా పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు అవగాహన పొందడంతో పాటు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొని అవకాశం కలుగుతుంది. మీ జీవిత భాగస్వామి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడం పాటు భవిష్యత్తుపై అతనికి ఉన్న ప్రణాళిక గురించి ఒక అవగాహన వస్తుంది కాబట్టి పెళ్లి అయిన తర్వాత గొడవలకు ఆస్కారం ఉండదు.

గతంలో పెళ్లిళ్లు అంటే తెలిసిన సంబంధాలు చేసే వాళ్ళు కాబట్టి పెద్దగా కొత్తదనం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పెరుగుతున్న బ్యూరో మ్యారేజెస్ మరియు లవ్ మ్యారేజ్ కారణంగా పెళ్లి తర్వాత పరస్పర భిన్న వాతావరణ ఎదుర్కోవాల్సి రావడం వల్ల ఇటు అమ్మాయి అటు అబ్బాయి ఇబ్బంది పడే పరిస్థితి ఎదురవుతుంది. వీటన్నింటికీ చక్కని పరిష్కారమే ఈ ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్.

ALSO READ : జ్యోతి మౌర్య కేసులో పెద్ద ట్విస్ట్..! ఆమె తండ్రి ఏం అన్నారంటే..?


End of Article

You may also like