Raghava Reddy Review: హీరోయిన్ రాశి నటించిన “రాఘవ రెడ్డి” సినిమా ఎలా ఉంది.? స్టోరీ, రివ్యూ &రేటింగ్..!

Raghava Reddy Review: హీరోయిన్ రాశి నటించిన “రాఘవ రెడ్డి” సినిమా ఎలా ఉంది.? స్టోరీ, రివ్యూ &రేటింగ్..!

by kavitha

Ads

సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడంతో చిన్న సినిమాలన్నీ మొదటి వారంలో ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. అలా రాఘవ రెడ్డి మూవీ జనవరి 5న రిలీజ్ అయ్యింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశీ ఈ మూవీలో ఫుల్ లెంత్ పాత్రలో నటించింది. శివ కంఠంనేని హీరోగా నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

  • చిత్రం : రాఘవ రెడ్డి
  • నటీనటులు : శివ కంఠంనేని,నందిత శ్వేత, రాశి, రఘుబాబు, అన్నపూర్ణ, అజయ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి తదితరులు
  • నిర్మాత : K. S. శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు
  • దర్శకత్వం : సంజీవ్ మేగోటి
  • సంగీతం : సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో
  • విడుదల తేదీ : జనవరి 5, 2024

స్టోరీ :

కాలేజీలో ప్రొఫెసర్‌గా రాఘవ రెడ్డి (శివ కంఠంనేని) పని చేస్తుంటాడు. క్రిమినాల‌జీ ప్రొఫెసర్‌ కావడంతో రాఘవ రెడ్డి కష్టమైన కేసులలో సాల్వ్ చేయడం ద్వారా పోలీసులకు సహాయం చేస్తుంటాడు. అయితే ప్రొఫెసర్‌గా ఉన్న కాలేజ్‌కి స్టూడెంట్‌గా లక్కీ (నందితా శ్వేత) వస్తుంది. ఆమె కాలేజీలో ఎంట్రీ ఇస్తూనే తన అల్లరితో అక్కడున్న వారికి ఇరిటేషన్ కలిగేలా చేస్తుంది. కాలేజ్ అంతా భయపడే ప్రొఫెసర్‌ రాఘవ రెడ్డిని సైతం లక్కీ పట్టించుకోదు. తనకు నచ్చినట్టుగా ఓ రౌడీలా ప్రవర్తిస్తుంటుంది.
ల‌క్కీ ప్రవర్తన వ‌ల్ల ఇతర స్టూడెంట్స్ ఇబ్బందులు పడతుండడంతో రాఘ‌వ‌రెడ్డి ఆమెకు ప‌నిష్‌మెంట్ ఇస్తాడు. దాంతో ల‌క్కీ రాఘ‌వ‌రెడ్డి పై కోపం పెంచుకుంటుంది.ఆ తరువాత లక్కీ త‌ల్లి దేవకీ (రాశీ) రాఘ‌వ‌రెడ్డికి కనిపిస్తుంది. ఆమెను చూడగానే రాఘవ రెడ్డి భయపడి, పరిగెడుతుంటాడు. లక్కీ తన పుట్టినరోజుకు ముందు అదృశ్యం అవుతుంది. రాఘ‌వ‌రెడ్డి ల‌క్కీని కిడ్నాప్ చేశాడ‌ని దేవ‌కి ఆరోపిస్తుంది. ఆమెను ఎవరు కిడ్నాప్ చేసారు? దేవ‌కి రాఘ‌వ‌రెడ్డిని సందేహించడానికి కార‌ణం ఏమిటి?అసలు దేవకిని చూడగానే రాఘవరెడ్డి ఎందుకు భయపడతాడు?  ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటనేది మిగిలిన కథ.
రివ్యూ :

ఇటీవల కాలంలో యూత్‌ఫుల్, రొమాంటిక్‌ స్టోరీస్ ట్రెండ్ ఎక్కువ‌గా కనిపిస్తోంది. ఫ్యామిలీ స్టోరీతో సినిమాలు తెరకెక్కించే హీరోలు, ద‌ర్శ‌కుల‌ సంఖ్య త‌గ్గింది. అయితే రాఘవరెడ్డి మూవీ యూత్ స్టోరీస్ కు భిన్నంగా ఫ్యామిలీ డ్రామాకు, క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ వంటి అంశాన్ని జోడించి డైరెక్టర్ సంజీవ్ మేగోటి ఈ మూవీని  తెర‌కెక్కించాడు.వృత్తి బాధ్య‌త‌ల వల్ల ఒక ప్రొఫెస‌ర్ ఎలా భార్యాపిల్ల‌ల‌కు దూర‌మ‌య్యాడు, మళ్ళీ వాళ్లు అత‌డి లైఫ్ లోకి ఎలా వ‌చ్చార‌నే పాయింట్ తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ సాగుతుంది.
హీరోకు మొదటి సినిమా అయినా ఎలివేషన్స్ ఎక్కువే ఇచ్చారు. హీరో పాత్ర ఓ వైపు కేసులను సాల్వ్ చేస్తూ, మరో వైపు ప్రొఫెసర్‌గా పనిచేస్తుండడం బాగానే చూపించారు. నందిత శ్వేత సీన్స్, ఆమెతో ఉండే శ్రీనివాస్‌ రెడ్డి కామెడీ ఒకే అనిపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం ఇలాగే సాగుతుంది. సెకండాఫ్‌ కీలకం, రాఘవ రెడ్డి ఎవరు, దేవకీతో ఆయనకున్న  సంబంధం ఏమిటనేది చూపించాడు.
రాఘవ రెడ్డిగా శివ కంఠంనేని చక్కగా నటించాడు. కొత్త యాక్టర్ అనే భావన ఎక్కడా కలగలేదు.  ఎమోషనల్‌ సన్నివేశాలు, సెంటిమెంట్‌ సన్నివేశాలలో తన నటనతో మెప్పించాడు. సీనియర్ హీరోయిన్ రాశీ చాలా రోజుల తర్వాత వెండితెర పైన కనిపించింది. తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. లక్కీగా నందిత శ్వేత పర్లేదు. మిగిలిన వారు తమ పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్ :

  • శివ కంఠ‌మ‌నేని, రాశి నటన,
  • తెలంగాణ యాస‌లో ఉన్న  డైలాగ్స్
  • ఎమోషనల్ సీన్స్మైనస్ పాయింట్స్:
  • రొటీన్ సీన్స్‌,
  • స్లో న‌రేష‌న్‌,
  • లాజిక్ లేకుండా సాగే సీన్స్

రేటింగ్ :

2.25/5

ట్యాగ్ లైన్ :

రాఘ‌వ‌రెడ్డి మూవీ ఫ్యామిలీ చిత్రాల లోటును కొంత భ‌ర్తీ చేసే మూవీ. పాత‌ కథ అయినా సీనియ‌ర్ యాక్టర్లు ఈ చిత్రానికి ప్లస్ గా మారారు. వారి న‌ట‌నతో మూవీకి ఫ్రెష్‌నెస్‌ను తీసుకొచ్చారు.

watch trailer :

Also Read: “యాత్ర 2″లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి డైరీ… అందులో ఏం రాసి ఉందో చూస్తే కన్నీళ్లు ఆగవు!

 


End of Article

You may also like