సచిన్ పేరుతో రైల్వే స్టేషన్…. ఎక్కడుందో తెలుసా..?

సచిన్ పేరుతో రైల్వే స్టేషన్…. ఎక్కడుందో తెలుసా..?

by Mounika Singaluri

Ads

భారతీయ రైల్వే వ్యవస్థలో చాలా స్టేషన్లకు గమ్మత్తయిన పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఒక్కొక్కసారి ఆశ్చర్యకంగ అనిపిస్తాయి. కొన్ని పేర్లు పలకడానికి కష్టంగా అనిపిస్తే కొన్ని పేర్లు ఇట్టే గుర్తుండిపోతాయి. కొన్ని స్టేషనులకు ఆ ప్రాంతాన్ని బట్టి మరికొన్ని స్టేషన్లకు అక్కడ ఉండే విశిష్టతను బట్టి పేర్లు పెట్టేవారు.అయితే గుజరాత్ లోని సూరత్ కు సమీపంలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ కి సచిన్ అనే పేరు ఉంది.

Video Advertisement

అయితే ఇది క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు ఈ రైల్వే స్టేషన్ కు ఎలాంటి సంబంధం లేదు. ఆ ఊరి పేరే సచిన్ ఇంతకీ ఈ రైల్వే స్టేషన్ గురించి ఎలా తెలిసిందంటే క్రికెట్ దిగ్గిజం సునీల్ గవాస్కర్ ఓ పర్యటన సందర్భంగా ఈ రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు .ఆ స్టేషన్ పేరు సచిన్ అని ఉండడం చూసి ఆశ్చర్యపోయిన ఆయన, ఈ విషయాన్ని ఓ ఫోటో ద్వారా అందరికీ తెలియజేశారు.

సచిన్ తన అభిమాన క్రికెటర్ అని, సచిన్ అనే పేరుతో రైల్వే స్టేషన్ ఉండడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని గవాస్కర్ వెల్లడించాడు. అంతేకాదు గత శతాబ్దంలో వారికి ఎంతో ముందు చూపు ఉందని, సచిన్ ఘనతలను అప్పుడే ఊహించి స్టేషన్ కు పేరు పెట్టేసారని చమత్కరించాడు. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. గవస్కర్ పోస్టుకు విపరీతమైన స్పందన వస్తుంది.

sachin bowling records

ఈ పోస్ట్ చూసిన సచిన్ టెండుల్కర్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ క్రికెట్ దేవుడు పేరు మీద ఏకంగా రైల్వేస్టేషనే ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ రైల్వేస్టేషన్ ఉందని చాలామందికి తెలియదు. కానీ ఇకపై చాలామంది సచిన్ రైల్వే స్టేషన్ సందర్శిస్తామని కామెంట్లు కూడా పెడుతున్నారు. సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డులతో చరిత్రలో తన పేరును నమోదు చేసుకున్నారని, ఇలా ఓ రైల్వే స్టేషన్ కూడా తన పేరు ఉండడం గర్వకారణం అని పలువురు చెబుతున్నారు.ఏది ఏమైనా సరే సునీల్ గవాస్కర్ సచిన్ అభిమానులకు మంచి శుభవార్తను తీసుకువచ్చారు.

Also Read:సూర్య ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది ఏమో..! ఇదే భారత్ ఓటమికి కారణం అయ్యిందా..?


End of Article

You may also like