సూర్య ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది ఏమో..! ఇదే భారత్ ఓటమికి కారణం అయ్యిందా..?

సూర్య ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది ఏమో..! ఇదే భారత్ ఓటమికి కారణం అయ్యిందా..?

by Mounika Singaluri

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇండియా ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచింది. అయితే మంగళవారం జరిగిన మూడవ టి20లో ఆస్ట్రేలియా చేతిలో అనూహ్యంగా టీమిండియా ఓటమిపాలైంది. విజయం మనదే అని అనుకున్నప్పటికీ తర్వాత మాక్స్ వెల్ సెంచరీ తో విధ్వంసం సృష్టించి ఆస్ట్రేలియా కి విజయాన్ని ఖరారు చేశాడు. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 222 భారీ పరుగులు చేసింది.  గైక్వాడ్ సెంచరీ తో చెలరేగాడు.

Video Advertisement

సూర్య కుమార్ కెప్టెన్సీ వైఫల్యం, ఫీలింగ్ వైఫల్యం, డెత్ ఓవర్లలో బౌలర్ల వైఫల్యంతో మ్యాచ్ ఓడిపోయింది. దీంతో సిరీస్ ను కైవాసం చేసుకోవాలన్న ఇండియాకు నిరాశ ఎదురైంది. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా ఓటమికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.

అందులో ముఖ్యమైనది సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ వైఫల్యం అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. బౌలర్లను సమర్థవంతంగా ఉపయోగించడంలో సూర్య విఫలమయ్యాడు. 19వ ఓవర్ లో పేసర్ తో కాకుండా స్పిన్నర్ అక్షర పటేల్ తో బౌలింగ్ వేయించడం వల్ల మన జట్టుకు మ్యాచ్ దూరమైందని చెబుతున్నారు. ఇక రెండో వైఫల్యం విషయంకొస్తే ప్రసిద్ధ కృష్ణ వేసిన 18  ఓవర్ లో వేడ్ ఇచ్చిన క్యాచ్ ను సూర్య కుమార్ వదిలేశాడు. ఆ క్యాచ్ పట్టుకుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇక మూడో కారణం బౌలర్ల వైఫల్యం టీం ఇండియా కొంపముంచింది.

13.3 ఓవర్లలో 134 పరుగులకే సగం వికెట్లు తీసిన మన బౌలర్లు ఆ తర్వాత మళ్లీ వికెట్ తీయలేకపోయారు. ముఖ్యంగా మ్యాక్స్ వెల్, వేడ్ భాగస్వామ్యాన్ని విడదీయలేకపోయారు. దీంతో వీరిద్దరూ కలిసి అజయంగా 39 బంతుల్లోనే 91 పరుగులు చేశారు. అయితే ఈ మ్యాచ్ లో చేసిన తప్పులను తర్వాత మ్యాచ్ లో పునరావృతం కాకుండా చూసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బౌలింగ్ యూనిట్ పరుగులను కట్టడి చేయడంలో మెరుగుపడాలని చెబుతున్నారు. ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి కాబట్టి వాటిపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు.

Also Read:జడేజాకి అలా… పాండ్యాకి ఇలా..! దీని వెనుక అంబానీ ఉన్నారా..?


You may also like

Leave a Comment