Ads
ఐపీఎల్ 2024 ఎడిషన్ కోసం ప్లేయర్స్ రిటెన్షన్, రిలీజ్ ప్రాసెస్ నవంబర్ 26న ముగిసింది. ఈ క్రమంలో పలు ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వీటిలో హార్దిక్ పాండ్యా ఫ్రాంచైజీ మార్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Video Advertisement
గత కొన్ని రోజులగా హార్ధిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చేస్తున్నాడని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. గుజరాత్ ప్రాంచైజీ హార్దిక్‌ను రిటైన్ చేసుకుందని, అయితే ఆ తరువాత ముంబై జట్టు ట్రేడింగ్ ద్వారా హార్దిక్‌ను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. అది కూడా క్యాష్ డీల్ ట్రేడింగ్ కావడంతో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సందడి ప్రారంభమైంది. డిసెంబర్ 19న ఐపీఎల్ మినీ వేలం దుబాయ్‌లో జరగనుంది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకున్నట్లు తెలిపింది. అయితే ఆ తరువాత ముంబై ఇండియన్స్ హార్దిక్ ను ట్రేడింగ్ చేసుకున్నట్లు అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో క్యాష్ డీల్ ట్రేడింగ్ రూల్స్ లో ఉందా? హార్దిక్ కోసమే రూల్‌ను కొత్తగా తీసుకొచ్చారా అనే అనుమానం అందరిలో కలుగుతోంది.
ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా, ఈసారి రిటెన్షన్ ప్రాసెస్ పూర్తయిన తరువాత ట్రేడింగ్ విండోకు గడువు డిసెంబర్ 12 దాకా పెంచడం కూడా పలు సందేహాలను కలుగచేస్తోంది. గుజరాత్ జట్టులోకి వెళ్ళిన మొదటి సీజన్ లో ఆ జట్టును హార్దిక్ విజేతగా నిలిపాడు. 2022 సీజన్‌లో గుజరాత్ ను రన్నరప్‌గా నిలపాడు. అలాంటి హార్దిక్ ను గుజరాత్ జట్టు ఎందుకు వదులుకుంది అనేది తెలియాల్సి ఉంది. అసలు హార్దిక్ గుజరాత్ ను వదిలి ముంబై జట్టులోకి అతనే వెళ్లాడా? ఫ్రాంచైజీల అంగీకారంతో ఈ ట్రేడింగ్‌కు అంగీకరించడా అనేది కూడా తెలియాల్సి ఉంది.
హార్దిక్ పాండ్యానే ఒకవేళ ముంబై ఇండియన్స్ జట్టును సంప్రదిస్తే, ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించినట్లే అవుతుంది. ఐపీఎల్ 2010 మొదలవడానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న ప్లేయర్ రవీంద్ర జడేజా, ఇతర జట్ల ఫ్రాంచైజీలతో సంప్రదింపులు చేశాడని, కాంట్రాక్ట్ ప్రైజ్ పెంచమని అడిగడాని నిషేధించిన విషయం తెలిసిందే. మరి హార్దిక్ కూడా ముంబై ఫ్రాంచైజీతో సంప్రదింపులు చేశాడని టాక్ వినిపిస్తోంది.
జడేజాలాగే హార్దిక్ పై చర్యలు తీసుకుంటారా? లేదా ట్రేడింగ్ విండో మరియు ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ మార్చరా అని చర్చలు జరుగుతున్నాయి. అయితే రెండు ఫ్రాంచైజీలు కూడా ఈ విషయంపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. అందువల్ల ముంబై జట్టు క్యాచ్ డీల్ ట్రేడింగ్ ద్వారా హార్దిక్ ని పొందినట్టు టాక్. ఐపీఎల్ ముఖేష్ అంబానీ చేతుల్లో ఉందని, అతను ఏమో చెప్తే అదే జరుగుతుందని, కావాలంటే రూల్స్ ను కూడా ఛేంజ్ చేస్తారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కావాలని కోరి మరీ కొనుక్కున్నారు…ఆ ప్లేయర్ ని ఒక్క సీజన్ కే వదిలేసారు ఏంటి KKR.?
End of Article