కావాలని కోరి మరీ కొనుక్కున్నారు…ఆ ప్లేయర్ ని ఒక్క సీజన్ కే వదిలేసారు ఏంటి KKR.?

కావాలని కోరి మరీ కొనుక్కున్నారు…ఆ ప్లేయర్ ని ఒక్క సీజన్ కే వదిలేసారు ఏంటి KKR.?

by Mounika Singaluri

Ads

ఐపీఎల్ 2024 సీజన్ హాట్ హాట్ గా ఉండేటట్టు కనిపిస్తుంది. ఇప్పటికే టీం లన్ని కూడా ప్లేయర్లపై దృష్టి పెట్టాయి. ఉంచుకున్న ప్లేయర్లు, వదిలించుకున్న ప్లేయర్ ల జాబితాను ప్రకటించాయి. మిగిలిన జట్లతో పోలిస్తే కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు భారీ ప్రక్షాళనే చేసింది. మెంటార్ గా గౌతం గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత జట్టును గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Video Advertisement

ఎక్కువమంది ప్లేయర్లను వదిలేసిన టీం గా కేకేఆర్ హైలైట్ అయింది.వదిలించుకున్న ప్లేయర్లలో షకీబుల్ హసన్, లిట్టన్ దాస్, డేవిడ్ వీస్, మన్ దీప్ సింగ్, ఉమేశ్ యాదవ్, లూకీ ఫెర్గూసన్ లాంటి ప్లేయర్లు ఉండటం విశేషం. వీరితో పాటు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ ను కూడా కేకేఆర్ వదిలించుకుంది.

ఇటీవలె ముగిసిన వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఉన్న శార్దుల్ ఠాకూర్ ను వేలంలోకి రిలీజ్ చేసిన కేకేఆర్ అందరినీ ఆశ్చర్య పరిచింది. వరల్డ్ కప్ లో మొదట్లో మూడు మ్యాచ్ లు ఆడిన శార్దూల్ మంచి ప్రదర్శన చేశాడు. అయితే తర్వాత తనకి జట్టులో అవకాశం రాలేదు.2022లో జరిగిన మెగా వేలంలో శార్దుల్ ఠాకూర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.సీజన్ పూర్తయిన తర్వాత ఢిల్లీ నుంచి ట్రేడింగ్ పద్దతిలో కేకేఆర్ శార్దుల్ ఠాకూర్ ను సొంతం చేసుకుంది. ఆ సమయంలో రూ. 10.75 కోట్లను ఢిల్లీ క్యాపిటల్స్ కు చెల్లించింది.

అయితే 2023 ఐపీఎల్ సీజన్ లో శార్దుల్ ఆశించిన స్థాయిలో రాణించలేదు.11 మ్యాచ్ లు ఆడి కేవలం 7 వికెట్లు మాత్రమే తీశాడు. ఇక బ్యాటింగ్ లో 113 పరుగులు మాత్రమే చేశాడు. సీజన్ మొత్తం విఫలం అవడంతో 2024 సీజన్nlo శార్దూల్ ను కేకేఆర్ వదిలించుకుంది.ఏరికోరి మరీ తెచ్చుకున్న శార్దుల్ ఠాకూర్ ను ఒక్క సీజన్ పూర్తికాగానే వదిలించుకోవడం అతడి అభిమానులకు రుచించడం లేదు. శార్దూల్ స్థానంలో ఎటువంటి ప్లేయర్లను తీసుకువస్తుందో వేచి చూడాలి.

Also Read:ఆ రెండు గంటల్లో ఏమైంది.? ఎంత మొత్తంలో డబ్బు చేతులు మారింది.?


End of Article

You may also like