Ads
ఇటీవల కాలంలో భారత జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫ్యామిలీ విషయాలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కోడలు రివాబాపై జడేజా తండ్రి అనిరుధ్ సిన్హా ఆరోపణలు చేయడమే ఇందుకు కారణం. తండ్రి చేసిన ఆరోపణల పై జడేజా కూడా స్పందించిన విషయం తెలిసిందే.
Video Advertisement
తాజాగా రవీంద్ర జడేజా తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ను తన భార్య రివాబాకు అంకితం చేశాడు. ఈ క్రమంలో ఆమె గురించి నెట్టింట్లో ఆరా తీస్తున్నారు. జడేజా సతీమణి బీజేపీ ఎమ్మెల్యే కూడా. మరీ ఆమె బ్యాగ్రౌండ్ ఎంతో ఇప్పుడు చూద్దాం..
రవీంద్ర జడేజా భార్య పేరు రివాబా సింగ్ సోలంకి. ఆమె 1990లో గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో నవంబరు 2న జన్మించింది. ఆమె తండ్రి పేరు హర్దేవ్ సింగ్ సోలంకి, ఆయన వ్యాపారవేత్త. తల్లి పేరు ప్రఫుల్లాబా సోలంకి, ఆమె భారత రైల్వేలో ఉద్యోగిని. రివాబా రాజ్‌కోట్‌లో ఉన్న ‘ఆత్మియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్’ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆమె రవీంద్ర జడేజా సిస్టర్ నైనాబాకు ఫ్రెండ్. ఒక పార్టీలో నైనా జడేజాకు రివాబాను తన ఫ్రెండ్ గా పరిచయం చేసింది.
అలా పరిచయం అయిన వారు, ప్రేమలో పడ్డారు. వారి ఎంగేజ్మెంట్ 2016లో ఫిబ్రవరి 5న పెద్దల సమక్షంలో జరిగింది. అదే సంవత్సరం ఏప్రిల్ 17న పెళ్లి చేసుకుని, వైవాహిక బంధంలో ప్రవేశించారు. 2017లో ఈ జంటకు కుమార్తె జన్మించింది. రివాబాకు రాజకీయాల పైన ఉన్న ఇంట్రెస్ట్ తో బీజేపీలో చేరింది. భర్త ప్రోత్సాహించడంతో పాలిటిక్స్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ గత ఏడాది డిసెంబరులో జరిగిన గుజరాత్ ఎన్నికలలో జామ్‌నగర్ ఎమ్మెల్యేగా విజయం సాధించింది.
డిఎన్ఏ రిపోర్ట్ ప్రకారంగా, రివాబా ఆస్తుల విలువ రూ. 64.3 కోట్లని తెలుస్తోంది. సొంతంగా రివాబా ఆస్తి విలువ 57.60 లక్షల రూపాయాల అని సమాచారం. జడేజా, రివాబా జంటకు అహ్మాదాబాద్, రాజ్‌కోట్, జామ్‌నగర్‌లో మొత్తం 6 ఇళ్ళు ఉన్నాయి. వీరి గ్యారేజ్‌లో ఫోర్డ్ ఎండీవర్, ఫోక్స్‌వ్యాగన్ పోలో జీటీ, ఆడి క్యూ 7 లాంటి లగ్జరీ కార్లు కలవు.
1.
2.3.4.
5.6.
7.
8.
9.10.11.
12.
Also Read: ఎందుకు ఇలా చేసావు జడ్డూ..? నీ క్రికెట్ కెరీర్ కోసం ఆయన కష్టపడితే.. నువ్వు మాత్రం..?
End of Article