“అల్లు అర్జున్” నిజ జీవితంలో ఇలా ప్రవర్తిస్తారా..? ఫోన్ చేయాలని అడిగితే..?

“అల్లు అర్జున్” నిజ జీవితంలో ఇలా ప్రవర్తిస్తారా..? ఫోన్ చేయాలని అడిగితే..?

by Mohana Priya

Ads

అల్లు అర్జున్ పరిచయం అవసరం లేని వ్యక్తి. పుష్ప సినిమాతో కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇతర భాషా ఇండస్ట్రీలలో కూడా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ మనకి మూవీస్ లో ఎలా ఉంటారో తెలుసు, కానీ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలీదు. ఈ విషయంపై కోరాలో ఓ వ్యక్తి ఇలా రాశారు. “అయితే 7,8 యేళ్ళ క్రిందట అట్లాంటాలో… నా ఫ్రెండ్ స్వప్న తన భర్త, ఇంకా ఒక సంవత్సరం ఉన్న తన కొడుకుతో సినిమాకి వెళ్ళింది. సినిమా చూస్తుండగానే బాబు ఏడవడం మొదలు పెట్టాడు.”

Video Advertisement

“ఇక చుట్టూ అందరికీ ఇబ్బంది అవ్వకూడదనే ఉద్దేశ్యంతో, హడావుడిగా బైటకి వచ్చేసింది మా ఫ్రెండ్. బాబు ఏడుపు ఎంతకీ ఆపక పోయే సరికి, చూస్తే డైపర్ మార్చాలని అర్థమయ్యిందట. కానీ బాగ్, లోపలే ఉండిపోవడంతో, తన హస్బెండ్ కి డైపర్ తీసుకురమ్మని ఎలా చెప్పాలని ఆలోచిస్తుందట. పోనీ లోపలకి వెళదాం అంటే మళ్ళీ అందరినీ దాటుకుంటూ అదొక ఇబ్బంది అనుకుని ఆగిపోయిందట.”

“ఇదిలా ఉంటే అటుగా రెస్ట్ రూమ్స్ వైపు వెళుతున్న ఒక అబ్బాయిని పిలిచి “కొంచం ఫోన్ ఇస్తారా! మా ఆయనకి ఫోన్ చేసుకుని డైపర్ తేమంటాను” అని అడిగిందట. ఆ అబ్బాయి కూడా వెంటనే ఫోన్ లాక్ తీసి ఇచ్చాడట. కాస్త ఫోన్ వాల్ పేపర్ పైన దృష్టి ఉన్నప్పటికీ, హడావిడిలో ముందు వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేసింది. కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చెయ్యక పోవడంతో…మా ఫ్రెండ్ స్వప్న చికాకును చూసి. జారిపోతున్న బాబుని ఎత్తుకుంటూ, మరొకసారి కాల్ చెయ్యమని ఆ అబ్బాయి చెప్పాడంట. మళ్ళీ చేస్తే కాల్ లిఫ్ట్ చెయ్యగానే విషయం చెప్పి వాళ్ళ హస్బెండ్ ని పిలిచి… ఫోన్ ఇచేస్తూ థాంక్యూ చెప్పిందట.”

cropped-allu-arjun-2.jpg

“అంతా బాగానే ఉంది అనుకునే లోపు, ఆ ఫోన్ ఇచ్చిన అబ్బాయి రెస్ట్ రూమ్ నుండి వెళుతుంటే అదిగో అతనే అండి నాకు ఫోన్ ఇచ్చింది అని స్వప్న తన హస్బెండ్ కి చెప్పింది. వెంటనే వాళ్ళ హస్బెండ్ అతన్ని చూసి ఒరినీ అతను అల్లు అర్జున్ కదనే అన్నాడట. దీంతో మా ఫ్రెండ్ కళ్ళు తుడ్చుకుంటూ, బాడీ గార్డ్స్ ని గమనిస్తూ అవునండీ. నాకు తట్టనే లేదు. మీకు కాల్ చేసినప్పుడు కూడా హడావిడిలో గమనించలేదు అని చెప్పిందట. అంత పెద్ద హీరోని ఈజీగా ఫోన్ అడిగేసావా అని స్వప్న హస్బెండ్ అన్నాడట. అంతా అలా చిటికెలో అయిపోయిందండీ అంటూ ఆ షాక్ లోనే ఉండిపోయిందట మా ఫ్రెండ్ స్వప్న.”

real life behavior of allu arjun

ఎంత గొప్ప మనిషి కదా తనని గుర్తించకపోయినా నొచ్చుకోకుండా, బాబుని ఎత్తుకుని మరీ మళ్ళీ కాల్ చేసి చూడండి అని చెప్పారు అంటే ఎంత డౌన్ టూ ఎర్త్ పర్సన్ కదా అని మాట్లాడుకున్నారు. ఇదంతా తెలిసాక నాకు కూడా అల్లు అర్జున్ మీద అభిమానం మరింత పెరిగింది. ఇలా ఒక స్టెప్పేస్తే అదే స్టెప్ వెయ్యడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అదే అతను సహాయం చేస్తే… అతని మీద అభిమానంతో మరింత రెట్టింపు స్థాయిలో తిరిగి చేసేస్తారు. ఇంత క్రేజ్ ఉన్న వ్యక్తి అసలు ఎంత డౌన్ టూ ఎర్త్ ఓ తెలుసా? ఒక ప్రాంతంలో ఆయన చేసిన పనికి, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు అనిపించుకున్నాడు అల్లు అర్జున్” అంటూ ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని ఓ అభిమాని నెట్టింట ఇలా పంచుకున్నాడు.


End of Article

You may also like