Ads
జిమ్ కి వెళ్లే వారిలో ట్రెడ్ మిల్ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. వాకింగ్, రన్నింగ్ లేదా జాగింగ్ చేయడం కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాము. ట్రెడ్ మిల్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. చాలా మంది దీనిని కొనుక్కుని ఇంట్లోనే పెట్టేసుకుంటారు. జిమ్ కి వెళ్లే అవసరం లేకుండా ఎంచక్కా ఇంట్లోనే రన్నింగ్ చేస్తూ ఉంటారు.
Video Advertisement
అయితే.. ఇది అసలు రన్నింగ్ లేదా వాకింగ్ చేసుకోవడానికి కనిపెట్టలేదని తెలుసా..? ఇప్పుడంటే మనం పొద్దున్న లేవగానే వెయిట్ తగ్గడం కోసం రన్నింగ్, జాగింగ్, వాకింగ్ లాంటివి చేస్తున్నాం కానీ అసలు దీనిని జైలులో ఉండే ఖైదీల కోసం కనిపెట్టారట.
ట్రెడ్ మిల్ ఖైదీల కోసం ఎందుకు కనిపెట్టారు..? ఎవరు కనిపెట్టారు? అనే విషయాలను ఈరోజు ఆర్టికల్ లో తెలుసుకుందాం. ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేయడం అనేది నిజానికి ఒక టార్చర్ లానే ఉంటుంది. అసలు ఇది టార్చర్ లా ఉండాలనే కనిపెట్టారు. 1818లో, సర్ విలియం క్యూబిట్ అనే ఆంగ్ల సివిల్ ఇంజనీర్ “ట్రెడ్-వీల్” అనే యంత్రాన్ని కనిపెట్టారు. దీన్నే మనం ట్రెడ్ మిల్ అని పిలుస్తున్నాం.
వాస్తవానికి ఇది మొండిగా, పట్టుదలతో వ్యవహరించే ఖైదీలకు బుద్ధి చెప్పడం కోసం కనిపెట్టారు. ఇది కనిపెట్టిన మొదట్లో ఇప్పుడు ఉన్నట్లు ఉండేది కాదు. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ మిల్స్ ఫ్లాట్ గా భాగం మెషిన్ ఆన్ చేయగానే కదులుతూ ఉంటుంది. దానిపై మనం నడక సాగిస్తూ ఉంటాం. కానీ ఇది మొదట్లో కనిపెట్టినప్పుడు 24 చువ్వలని ఉపయోగించారు. ఈ చువ్వలు ఒకదానికి ఒకటి టచ్ అవ్వవు. చివర్లలో మాత్రం ఇవి సీల్ చేయబడి ఉంటాయి.
వీటిపై నడుస్తూ ఉన్నప్పుడు అవి రోల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వస్తున్న ట్రెడ్ మిల్స్ పై నడవడం కంటే మొదట్లో కనిపెట్టబడిన ట్రెడ్ మిల్స్ పై నడవడం మరింత నరకంగా ఉండేది. ఖైదీలను శిక్షించడం కోసమే మొదట్లో ఈ యంత్రాన్ని రూపొందించారు. అది క్రమంగా రూపాంతరం చెంది వ్యాయామం చేసుకునే సాధనంగా మార్కెట్ లోకి వచ్చింది.
End of Article