ఎన్టీఆర్ చాలా కాలం కాషాయ దుస్తులే ఎందుకు ధరించారు..? అలా ధరించమని ఎవరు చెప్పారు..?

ఎన్టీఆర్ చాలా కాలం కాషాయ దుస్తులే ఎందుకు ధరించారు..? అలా ధరించమని ఎవరు చెప్పారు..?

by Anudeep

Ads

సీనియర్ ఎన్టీఆర్ కి ఎంత పేరు ఉందో మనకి తెలుసు. నటనతో ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్. సినిమా పరిశ్రమలో ఎదురులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్. నిజానికి అన్న గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.

Video Advertisement

ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నటించిన సినిమాలు ఆయనని నిత్యం ప్రేక్షకుల గుండెల్లోనే ఉంచుతాయి. ఆయన గురించి ప్రతి విషయాన్నీ ఇప్పటికీ ఆసక్తిగా తెలుసుకునే అభిమానులు ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు.

ntr orange clothes 1

ఎన్టీ రామారావు గారు గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో అద్భుతమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. అటు రాజకీయాల్లో కూడా అద్భుతంగా రాణించారు.సినిమా జీవితం తరువాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన అన్నగారు చాలా కాలం పాటు కాషాయ వస్త్రాలను ధరించిన సంగతి తెలిసిందే.

ntr orange clothes 2

మొదటిసారిగా ఆయన తిరుమలలో ఓ సినిమా ఫంక్షన్ కి వచ్చినప్పుడు కాషాయ వస్త్రాలను ధరించి వచ్చారు. ఆ ఫంక్షన్ వచ్చిన వారు అందరు ఆయన గెటప్ ను చూసి షాక్ అయినా ఎవరూ ఆయనను ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయారు. అయితే ఆ ఫంక్షన్ అయిపోయాక మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు. అప్పట్లో చిన్నారిని చెరిచిన దుర్ఘటన తన మనసుని కలిచివేసిందని.. ప్రాపంచిక సుఖాలను విడిచిపెట్టి సన్యాసిగా మారడం కోసమే కాషాయ వస్త్రాలకు మారానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ntr orange clothes 3

ఆరోజుల్లో మాన‌వ హ‌క్కుల ఉద్య‌మ నేత స్వామి అగ్నివేష్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకునే తాను కాషాయ వస్త్రాలను ధరించినట్లు చెప్పుకున్నారు. అగ్నివేశ్ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. అప్పుడే కాషాయ వస్త్రాల గొప్పదనం గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ తాను కూడా వాటిని ధరించడం ప్రారంభించారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు ఆయనను డ్రామారావు అని విమర్శించినా కూడా పట్టించుకోలేదట.


End of Article

You may also like