2011 లో “రోహిత్ శర్మ” చెప్పిందే… ఇప్పుడు నిజం అయ్యిందిగా..? ఇంతకీ ఏమన్నారంటే..?

2011 లో “రోహిత్ శర్మ” చెప్పిందే… ఇప్పుడు నిజం అయ్యిందిగా..? ఇంతకీ ఏమన్నారంటే..?

by Anudeep

Ads

ఇండియా – ఇంగ్లాండ్ మధ్య నిన్న జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ 17 పరుగుల తేడాతో గెలిచింది. ఇండియా టార్గెట్ 216 రన్స్ కాగా 31 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది టీం ఇండియా. అయితే మరో వైపు సూర్యకుమార్ యాదవ్ మాత్రం క్లాసిక్ షాట్లతో అందరిని ఆకట్టుకున్నాడు. కేవలం 55 బంతుల్లో, 14 ఫోర్లు, 6 సిక్సులతో 117 పరుగులు చేసాడు.

Video Advertisement

ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో బ్యాటర్ గా సూర్యకుమార్ రికార్డ్ సృష్టించాడు. రోహిత్ శర్మ 118 తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. అయితే.. కెప్టెన్ రోహిత్ శర్మ 2011 లో ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసాడు. ఇండియా టీంలోకి ఉత్తేజకరమైన యువ క్రికెటర్లు రాబోతున్నారు. ముంబై నుంచి వచ్చే యంగ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తులో ఎన్నో అద్భుతాలు చేస్తాడు మీరే చూడండి అంటూ అప్పుడు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

సూర్యకుమార్ అద్భుత ఆటతీరు మైదానం నలువైపులా భారీ షాట్లతో ఇంగ్లాండ్ ను వణికిస్తూ భారత్ కు విజయంపై ఆశలు రేపాడు కానీ అతనికి మరో ఎండ్ లో ఎవరు సహకరించలేదు. దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా ఎవరు కాసేపు క్రీజులో నిలదొక్కుకున్న ఇండియా గెలిచేదే. దీంతో సిరీస్ లో ఇండియాకు తొలి ఓటమి తప్పలేదు. అయినా 2-1 తో సిరీస్ ఇండియానే గెల్చుకుంది.

నిన్నటి ఆటతో రానున్న రోజుల్లో సూర్యకుమార్ యాదవ్ నుంచి మరిన్ని క్లాసిక్ ఇన్నింగ్స్ చూసే అవకాశం ఉంది అని అర్థమవుతుంది. ఈ సెంచరీతో సూర్యకుమార్ ఇండియా టీంలో తన బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాడని చెప్పవచ్చు. అలాగే టీం ఇండియా మాజీ ఆటగాళ్లు  వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ సూర్యకుమార్ ను అభినందిస్తు ట్వీట్లు చేశారు.


End of Article

You may also like