ఇండియా, పాకిస్తాన్ తలపడుతున్నాయంటే అందరి దృష్టి ఆ మ్యాచ్ పైనే ఉంటుందనేది తెలిసిన విషయమే. పురుషుల క్రికెట్ లో ఇండియా, పాకిస్తాన్ జట్లు ఆడుతున్నాయంటే ఆ మ్యాచ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం ఈ రెండు దేశాలలో మాత్రమే కాకుండా క్రికెట్ ప్రపంచమంతా కూడా ఎదురుచూసేది.
Video Advertisement
పాక్ మాజీ ఆల్ రౌండర్ అయిన అబ్ధుల్ రజాక్ తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇండియన్ క్రికెట్ టీమ్ లో క్రికెట్ దేవుడుగా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్, విధ్వంసక బ్యాటర్ చాలా డేంజరస్ ఆటగాళ్లని అబ్దుల్ రజాక్ చెప్పాడు. ఇక సెహ్వాగ్‌ను ఔట్ చేయడానికి పాక్ ఆటగాళ్లు ఎన్నో కష్టాలు పడేవారని గతాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎంతో ప్రమాదకరమైన ప్లేయర్ అని, సచిన్ కూడా తక్కువ కాదని తెలిపాడు.
సచిన్, సెహ్వాగ్ జోడికి పాక్ జట్టు బౌలింగ్ చేయదానికి వ్యతిరేకంగా ప్లాన్ వేయాల్సి వచ్చేదని తెలిపాడు. వీరిద్దరిని అవుట్ చేస్తేనే ఆ మ్యాచ్ గెలువడమే మా ప్లాన్ అని చెప్పాడు. ఈ ఇద్దరితో పాటుగా యువరాజ్ సింగ్ పాక్ బౌలర్లను చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఈ ముగ్గుర్ని అవుట్ చేసినపుడు గొప్పగా ఫీలయ్యే వాళ్లమని చెప్పాడు. సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ లు పాకిస్థాన్ పై చాలా సార్లు భారీ భాగస్వామ్యాలను చేశారు. ఒకరు అవుట్ అయితే ఇంకొకరు ప్రత్యర్థి జట్టు మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించేవారు.
ముల్తాన్‌లో పాకిస్థాన్ జట్టు పై సచిన్ టెండూల్కర్ 194 రన్స్ తో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ ద్రవిడ్ ఆ సమయంలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో సచిన్ డబుల్ సెంచరీ చేసే ఛాన్స్ ను కోల్పోయాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తో పాటు సెహ్వాగ్ పాక్ జట్టు పై విధ్వంసం సృష్టించాడు. ముల్తాన్‌లో జరిగిన మ్యాచ్ లో సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్ కి పాక్ ప్లేయర్స్ వణికిపోయారు. ఈ మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ చేయడంతో సెహ్వాగ్‌ను ‘సుల్తాన్ ఆఫ్ ముల్తాన్’ గా పిలిచేవారు.
Also Read: పిల్లలని కాపాడటానికి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టాడు..! ఈ 2.80 కోట్ల “ఢిల్లీ క్యాపిటల్స్” ప్లేయర్ ఏం చేశాడో తెలుసా..?