దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు భారీ స్కోరు చేసినా కూడా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఐదు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఏడు బంతుల ముందే ఈ లక్ష్యాన్ని సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20లో ఛేజింగ్‌లో ఇదే అతిపెద్ద విజయంగా నిలిచింది.

Video Advertisement

అయితే ఈ మ్యాచ్ లో విండీస్ ఓడిపోయింది కానీ విండీస్ జట్టు కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ అందరి హృదయాల్ని గెలుచుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అకీల్ హొస్సేన్ వేసిన బంతిని లాంగాఫ్ వైపుగా డీకాక్ బాదాడు. దీన్ని ఆపేందుకు విండీస్ కెప్టెన్ రావ్‌మెన్ పావెల్ వేగంగా పరుగు తీశాడు. డైవ్ చేస్తే బంతి బౌండరీ వెళ్లకుండా ఆపే అవకాశం కనిపించింది. కానీ పావెల్ డైవ్ చేయలేదు.

westindies player saves child during match..!!

బౌండరీ లైన్ దగ్గర బంతిని పట్టుకోవడానికి ఐదేళ్ల పసివాడు ఉన్నాడు. తను డైవ్ చేస్తే ఆ పసివాడిని ఢీకొట్టడం ఖాయమని పావెల్‌కు అర్థమైంది. దీంతో డైవ్ చేయకుండా పరుగును ఆపే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే చాలా వేగంగా వస్తుండటంతో అతను పూర్తిగా కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అయితే పిల్లవాడికి తగలకుండా పసివాడి పైనుంచి ముందుకు దూకాడు. ఈ క్రమంలో వెనుక ఉన్న ఎల్‌ఈడీలను బలంగా తాకాడు. అక్కడితో ఆగకుండా వాటి పై నుంచి అవతలకు వెళ్లి, అక్కడ ఉన్న స్టీల్ పైపులను కూడా ఢీకొట్టాడు.

westindies player saves child during match..!!

ఈ గాయంతో పావెల్ వెంటనే మైదానంలోకి రాలేకపోయాడు. బౌండరీ లైన్ పక్కనే పడిపోయి నొప్పితో విలవిల్లాడాడు. జట్టు ఫిజియోలు వచ్చి అతనికి చికిత్స అందించారు. ఆ తర్వాత కాసేపటికి తేరుకున్న అతను మళ్లీ మైదానంలో అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఈ ఘటనపై సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక పావెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. రూ. 2.80 కోట్లకు ఢిల్లీ టీం ఈ ఆటగాడిని దక్కించుకుంది.