టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన చిత్రం శాకుంతలం. గుణ శేఖర్ దర్శకత్వం లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అభిమానుల అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. ఇక సమంత ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేసింది.

Video Advertisement

 

 

రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో ఆమె వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రియాంక చోప్రా నటించిన ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సిటాడెల్ కి ప్రీక్వెల్ గా ఈ సిరీస్ రాబోతున్నట్లు తెలుస్తోంది. దీన్ని దర్శకులు రాజ్, డీకే తెరకెక్కిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన సమంతను ’సిటాడెల్’ ఇండియన్ వర్షన్ మెయిన్ లీడ్ గా తీసుకున్నారు.

samantha role in citadel web series..!!

రూసో బ్రదర్స్ ఒరిజినల్ హాలీవుడ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. అక్కడ కూడా సిటాడెల్ పేరుతోనే తెరకెక్కుతోంది. ఈ సిరీస్ గ్లోబల్ వెర్షన్‌కు ప్రియాంక చోప్రా జోనాస్, రిచర్డ్ మ్యాడెన్, స్టాన్లీ టస్సీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సిరీస్లో సమంత రోల్ కి సంబంధించిన ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సిరీస్ హాలీవుడ్ వెర్షన్, బాలీవుడ్ వెర్షన్ రెండు వేర్వేరు కాలాల్లో జరుగుతుందట. అందులో ప్రియాంక చోప్రా చిన్నగా ఉన్నప్పుడు ఆమెకు తల్లి పాత్రలో సమంత కనిపించనున్నట్లు సమాచారం.

samantha role in citadel web series..!!

ఈ సిరీస్ లో వరుణ్ ధావన్‌‌తో పాటు సామ్ కూడా హై యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే సామ్ వాటికి సంబంధించిన సెట్స్‌కు కొన్ని గ్లింప్స్‌ వీడియోలను షేర్ చేసింది. సామ్‌కు ఈ యాక్షన్ ఘట్టాల్లో నటించడం ఇదే తొలిసారి కాదు.

samantha role in citadel web series..!!

ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కోసం ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే పోరాటలను చేసింది. రాజీగా ఆమె నటనకు, యాక్షన్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. అలాగే యశోద లో కూడా యాక్షన్ సీక్వెన్స్ లలో ఇరగదీసింది సామ్. దీంతో సిటాడెల్ లోనూ అదే తరహా యాక్షన్ సన్నివేశాలు రిపీట్ అవుతాయని ఫాన్స్ ఆశిస్తున్నారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుంది.

Also read: “సిటాడెల్‌” వెబ్ సిరీస్ కి “సమంత” ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?