సమ్మర్ లో తాటి ముంజ‌లు తింటే ఈ ఆరు లాభాలను పొందొచ్చు తెలుసా..?

సమ్మర్ లో తాటి ముంజ‌లు తింటే ఈ ఆరు లాభాలను పొందొచ్చు తెలుసా..?

by Megha Varna

Ads

వేసవి కాలంలో మనకి తాటి ముంజలు దొరుకుతుంటాయి. తాటి ముంజలు వల్ల ఎన్నో లాభాలు పొందొచ్చు. వేసవికాలంలో మామిడి పండ్లు, పుచ్చకాయ, కీరా వంటివి తీసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది. అలాగే తాటి ముంజులు కూడా శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. అయితే ఈ రోజు వేసవిలో తాటి ముంజలు తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు పొందొచ్చు అనే దాని గురించి చూద్దాం.

Video Advertisement

వేసవిలో మన శరీరంలో సహజంగా వేడిగా మారుతుంది. తాటి ముంజలు తీసుకోవడం వల్ల ఆ వేడి తగ్గి శరీరం చల్లబడుతుంది. పైగా వేసవి కాలంలో చెమట ఎక్కువగా పడుతుంది దీంతో నీరంతా కూడా బయటకి వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనం తాటి ముంజులు తీసుకుంటే శరీరానికి నీళ్లు అందుతాయి.

#1. తాటి ముంజలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఇమ్యూనిటీని పెంచుకోవడానికి దీన్ని తీసుకోవచ్చు. అలాగే జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా తొలగిస్తుంది.

#2. వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కనుక వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడే వాళ్ళు తాటి ముంజులు తీసుకుంటే చక్కటి లాభాలను పొందవచ్చు.

#3. తాటి ముంజలు లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. హైబీపీతో బాధపడే వాళ్లు దీనిని తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ ని కూడా ఇది శుభ్రపరుస్తుంది.

#4. తాటి ముంజలు తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది మీరు మరింత యవ్వనంగా కనబడాలంటే ఇది సహాయం చేస్తుంది.

#5. గర్భిణులు పాలిచ్చే తల్లులు తాటి ముంజలు తీసుకుంటే బిడ్డకు కావాల్సిన పోషకాలు అందుతాయి.

#6. తల తిరగడం వికారం వంటి సమస్యల నుండి కూడా గర్భిణీలు బయటపడవచ్చు.


End of Article

You may also like