ఆ దర్శకుడికి జీవితాంతం రుణపడి ఉండే సాయం చేసిన ఎన్టీఆర్.. ఇంతకీ అదేంటంటే..?

ఆ దర్శకుడికి జీవితాంతం రుణపడి ఉండే సాయం చేసిన ఎన్టీఆర్.. ఇంతకీ అదేంటంటే..?

by Anudeep

Ads

సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. అందులో రాణించాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అయితే.. అందరికి అది సాధ్యం కాదు. ఇప్పుడంటే పోటీ ప్రపంచం ఎక్కువైందని.. అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని అనుకుంటున్నారు. ఒకప్పుడు ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలో కూడా సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి చాలా ఇబ్బందులే పడాల్సి వచ్చింది.

Video Advertisement

ఆ రోజుల్లో కూడా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ విషయాన్నీ అప్పటి నటులే పలు సార్లు ఇంటర్వ్యూలలో చెప్తూ ఉండడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం.

cnr 1

ప్రముఖ పాటల రచయిత సింగిరెడ్డి నారాయణ రెడ్డి కూడా సినీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టడానికి చాలా ప్రయత్నాలే చేశారట. ఆయనని మనం ముద్దుగా సినారె అని పిలుచుకుంటూ ఉంటాం. సినిమా రంగంలోకి రాకముందే ఆయనకు రచయితగా కాస్తో కూస్తో గుర్తింపు ఉండేది. అయితే సినీ రంగంలో అడుగుపెట్టడానికి మాత్రం ఆయన చాలా ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వచ్చింది.

cnr 2

ఆయనకు అవకాశాలు రాకపోవడంతో ఆయన విజయవాడ వెళ్లిపోవడానికి మద్రాస్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారట. అయితే అక్కడే ఓ అద్భుతం చోటు చేసుకుంది. అక్కడ కొంతమంది తెలుగు వారు సినారెని గుర్తించి అక్కడే శాలువా కప్పి సన్మానం చేసేసారు. ఈ సన్మానం బాగా వైరల్ అయిపొయింది. ఈ సన్మానం గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ స్వయంగా ఆయనను పిలిపించుకుని కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందుతున్న గులేబకావళి సినిమాలో ఓ పాట రాసే అవకాశాన్ని ఇచ్చారట.

cnr 3

అసలు కామేశ్వర రావు కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోరు. అలాంటిది సినారెకి అవకాశం ఇప్పించడం కోసం అన్నగారు దర్శకుడు కామేశ్వరావు తో చాలా చర్చలే జరిపారట. అలా.. సినారె కు గులేబకావళి సినిమాలో తన తొలి పాట రాసే అవకాశం లభించింది. ఆ పాట “నన్ను దోచుకుందువటే.. వన్నెల దొరసాని..” అనే పాట. ఈ పాట ఇప్పటికీ హిట్ సాంగ్ లిస్ట్ లో ఉంటుంది. ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. ఆ తరువాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు సినారె. సంగీత దర్శకుడిగా అనతి కాలంలోనే సినారె పేరు గడించారు. అంతే కాదు టీడీపీ తరపున రాజ్యసభకు కూడా వెళ్లారు. అందుకే సినారె ఎప్పుడూ అన్నగారికి రుణపడే ఉంటా అని చెబుతూ ఉంటారు.

 


End of Article

You may also like