“పుష్ప అంటే ఫైర్..!” డైలాగ్ వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసా..?

“పుష్ప అంటే ఫైర్..!” డైలాగ్ వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసా..?

by Megha Varna

Ads

అల్లు అర్జున్ కి పుష్ప సినిమా మంచి హిట్ ని ఇచ్చింది. ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా. ఈ సినిమాలో ఎర్ర చందనం సీన్స్ బాగా హైలైట్ అయ్యాయి. ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. పైగా ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ కి ఎంతో మంది ఫిదా అయిపోయారు.

Video Advertisement

చాలా మంది సెలబ్రిటీలు అయితే అల్లు అర్జున్ ని ప్రశంసించారు కూడా. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా సినిమా.

దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్ సుకుమార్ కలిసి చేసిన సినిమా పుష్ప. అల వైకుంఠపురంలో తర్వాత మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని బన్నీకి తీసుకొచ్చింది. డిసెంబర్ 17 న ఈ చిత్రం విడుదల అయ్యింది. ఈ చిత్రంలో పాటలు, డైలాగ్స్ సైతం అన్నీ కూడా బాగా ఆకట్టుకున్నాయి. డైలాగ్స్ అంటే అందరికీ గుర్తు వచ్చేది ”పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుంటివా ఫైర్” అన్నది బాగా హిట్ అయ్యింది. అయితే ఈ డైలాగ్ వెనుక స్టోరీ ఉంది.

మరి అసలు ఈ డైలాగ్ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ హరీష్ శంకర్ ని మీట్ అయ్యి బన్నీ పుష్ప గురించి చెప్పారట. ఇంకా షూటింగ్ కాకుండానే డైరెక్టర్ హరీష్ శంకర్ దగ్గరకి వెళ్లి సినిమా టైటిల్ పుష్ప అని చెప్పారట. దానికి ఆయన ఇది అమ్మాయి పేరులా ఉందని అన్నారట.

పైగా దీనికి అర్ధం ఫ్లవర్ అని కూడా వస్తుందన్నారట. అలానే ఈ పేరు సాఫ్ట్ గా ఉంది అన్నారట. అయితే అందరికీ ఇలాంటి భావన కలగకుండా ఉండకూడదని ”పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్” అనే డైలాగ్ ని పుష్ప సినిమాలో పెట్టారట.

 


End of Article

You may also like