ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటర్మీడియట్ వరకు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారనే విషయం మన అందరికీ తెలుసు. ఇంటర్ తర్వాత ఆయన ఎక్కడ చదివారు? ఏం చేశారు? ఏ కళాశాలలో తన డిగ్రీ పూర్తి చేశారు? డిగ్రీలో ఆయన ఏ కోర్స్ చేశారు? ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉండేవి. ఇప్పుడు ఆ ప్రశ్నలు అన్నిటికి సమాధానం దొరికింది.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న సీఎం జగన్ తర్వాత ప్రగతి మహావిద్యాలయాలో డిగ్రీలో చేరారు. కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా మూడేళ్లు డిగ్రీ ఆయన అక్కడే పూర్తి చేశారు. బిజినెస్ ఎకనామిక్స్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టాటస్టిక్స్, బ్యాంకింగ్, బిజినెస్ ఆర్గనైజింగ్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ సివిలైజేషన్ లో ఆయన తన డిగ్రీ ని పూర్తి చేశారు.
తన మూడేళ్ల డిగ్రీని ఆయన ఫస్ట్ క్లాస్ తో పూర్తి చేశారు. మొత్తం 740 మార్కులను ఆయన సాధించారు. మార్కుల జాబితాను 1994 జూన్ 17వ తేదీన జారీ చేశారు. ఈ మార్కుల జాబితా పై ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కళాశాల రబ్బర్ స్టాంప్ స్పష్టంగా కనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఈ కళాశాల పని చేస్తుంది.
సర్టిఫికెట్ లో ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి పేరు కూడా స్పష్టంగా కనిపిస్తుందిసీఎం అవ్వకముందు జగన్ మోహన్ రెడ్డి బెంగళూరులో పలు బిజినెస్ లు చేసేవారు. చదివింది బిజినెస్ రిలేటెడ్ డిగ్రీ కావడంతో ఆయన బిజినెస్ లో బాగా రాణించారు. అనేక సంస్థలను స్థాపించారు.
Also Read:ఛీ!ఛీ! కూతురని కూడా ఆలోచించచడా ఈ పాక్ క్రికెటర్…కూతురు హిందూ దేవుడిని పూజించిందని.?