పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి విడిగా చెప్పాల్సిన పనిలేదు. ఇటు సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం మీద ఆయనకి ఎనలేని క్రేజ్ ఉంది. పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఆరోజు అభిమానులకు పండగే.
పవన్ కళ్యాణ్ ని సినిమాల తో పాటు వ్యక్తిగతంగా అభిమానించే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కూడా అదే విధంగా అభిమానులు ఆదరిస్తూ ఉంటారు. ఎక్కువ రాజకీయ జీవితంలో ప్రజల మధ్య ఉండే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని బయటికి రానివ్వరు. అప్పుడప్పుడు తన పిల్లలతో ఫ్యామిలీ ఫంక్షన్స్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి.

పవన్ కళ్యాణ్ కి తన రెండో భార్య రేణు దేశాయికి పుట్టిన అకిరా, ఆద్యాలు ఇప్పటికే ఫాన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అకిరా కటౌట్ చూసి పవన్ కళ్యాణ్ కి వారసుడు వచ్చాడని సంబరపడుతున్నారు. ప్రస్తుతం అకిరా యాక్టింగ్ లోను, డాన్సుల్లోనూ, మార్షల్ ఆర్ట్స్ లోను ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

అదేవిధంగా పవన్ కళ్యాణ్ కుమార్తె ఆధ్య కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. చాలాకాలం తర్వాత రేణు దేశాయ్ నటించిన టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తన తల్లి తో పాటు ఆద్య కూడా హాజరైంది. ఈవెంట్ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. చాలాకాలం తర్వాత ఆద్యను చూసిన అభిమానులు అచ్చం పవన్ కళ్యాణ్ తల్లి అంజన దేవి నోట్లో నుండి ఊడిపడ్డట్టు ఉందని ఆనందపడుతున్నారు. ఇద్దరి ఫోటోలను పక్కపక్కన పెట్టుకుని కంపేరిజన్లు మొదలుపెట్టారు. త్వరలో ఆధ్యా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.












ఇప్పుడు 2024 ఎన్నికలు సమీపించడంతో పవన్ కళ్యాణ్ జనసేన విజయకేతనం బలంగా ఉండే విధంగా అసెంబ్లీలో ఉండి పని చేయాలనే ఆత్రుతతో కసిగా కనిపిస్తున్నారు. తాజాగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశంతో పొత్తు ప్రకటించి అధికార వైసీపీకి పెద్ద షాక్ నే ఇచ్చారు.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూరా తిరుగుతున్నాయి.
తాజాగా ఆయన జనసేన నాయకులతో మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ… తెలుగుదేశంతో మనం కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, కేవలం జనాధారనతోనే ఇంతవరకు జనసేన నడిచిందని అన్నారు. ఆరున్నర లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని, ప్రజల భవిష్యత్తును బంగారమయం చేసే విధంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో వైసిపి పోవాలి, జనసేన-టిడిపి ప్రభుత్వం ఏర్పడే విధంగా ముందుకు వెళ్దాం అన్నారు. “సీఎం స్థానం వద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు.కానీ దానికోసం వెంపర్లాడను, నాకు సీఎంగా అవకాశం వస్తే తప్పకుండా తీసుకుంటాం. ప్రజల కోసం ఆదర్శ పాలన అందిద్దామని” పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనతో జనసేన నాయకుల్లోనూ, జనసైనికుల్లోనూ ఫుల్ జోష్ వచ్చింది.


