Ginna movie OTT Release: మంచు విష్ణు చాలా గ్యాప్ తరువాత ‘జిన్నా’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈషాన్ సూర్య డైరెక్షన్ చేసిన ఈ మూవీలో సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించారు. కామెడీని సైకలాజికల్ థ్రిల్లర్‌కు జోడించి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళంలో అక్టోబర్ 21న జిన్నా సినిమా విడుదలైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా, రోటీన్ స్టోరీ కావడంతో కలెక్షన్లను ఆశించిన మేర రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమాలోని విష్ణు నటన, కామెడీ సీన్లు,సన్నీ లియోన్, పాయల్ అందచందాలు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఈరోజు నుండి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా అంచనాలు అందుకోలేక, సన్ ఆఫ్ ఇండియా తరవాత మంచు ఫ్యామిలికి ఈ మూవీ మరో మైనస్‌గా మారింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కొత్త డైరెక్టర్ సూర్య తెరకెక్కించిన ఈ మూవీకి మోహన్ బాబు స్క్రీన్ ప్లే ఇవ్వడమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు. ఇక సన్ ఆఫ్ ఇండియా మూవీ మోహన్ బాబు మొత్తం కెరీర్లోనే అతి తక్కువ కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది. విష్ణు జిన్నా మూవీకి ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల కలెక్షన్స్ వచ్చాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా 4 కోట్లకు అమ్ముడవగా 3.28 కోట్ల నష్టం వచ్చింది.
Ginna movie OTT: Release Date, OTT Rights, OTT StreamingDateఈమధ్య కాలంలో మోహన్ బాబు కుటుంబం తరచూ వివాదాల్లో ఉండటం కూడా ఈ మూవీ పై ప్రభావం చూపిందని అంటున్నారు. థియేటర్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ మూవీగా నిలిచిన జిన్నా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ మూవీకి దర్శకుడు నాగేశ్వర రెడ్డి స్టోరీ అందించగా, కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో రఘు బాబు, అన్నపూర్ణమ్మ, సీనియర్ నరేష్, వెన్నెల కిశోర్, సునీల్, చమ్మక్ చంద్ర, తదితరులు నటించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు.