Suryakumar Yadav: టీ20 క్రికెట్లో భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్నాడు. అయితే అతను వన్డే మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. దీనిపై మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కామెంట్స్ చేశాడు.
ఇటీవలే టీమ్ ఇండియా న్యూజిలాండ్ పర్యటనను ముగించింది. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంది. అయితే వన్డే సిరీస్‌లో ఇండియా 0-1 తేడాతో సిరీస్ ను కోల్పోయింది. టీ20 లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ తుఫాన్ లాంటి బ్యాటింగ్ తో అది సిరీస్ గెలుపులో కీలకమైన పాత్ర వహించాడు. అంతేకాక టీ20లో టాప్1 గా నిలిచాడు. అలాంటి సూర్యకుమార్ వన్డే మ్యాచ్‌కి వచ్చేసరికి ఆడలేకపోయాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 306 పరుగులు చేసింది. కానీ ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ పెద్ద ఇన్నింగ్స్‌లు చేయలేదు.ఇక రెండవ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయ్యింది. మూడో వన్డేలో సూర్యకుమార్ నెమ్మదిగా మొదలు పెట్టి, కొన్ని షాట్లు ఆడినా అంతగా ఆడలేకపోయాడు. దాంతో టీ20లో బాగా ఆడిన సూర్యకుమార్ వన్డే మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయడం లేదని మాజీ క్రికెటర్స్ పేర్కొంటున్నారు. ఈ కారణం వల్లనే సూర్యకుమార్ కి టెస్టు ఆడే అవకాశం ఇప్పటి వరకు రాలేదు.
ఇక వసీం జాఫర్ ఏమన్నారంటే, టీ20 క్రికెట్లో ఫీల్డర్‌ను ఎప్పుడూ స్లిప్‌లో ఉంచరని, అందువల్ల ఫీల్డర్ క్యాచ్ అవుట్ కాలేదని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. వన్డేలలో మరియు టెస్ట్ క్రికెట్లో కొన్నిసార్లు ఒకటి, కొన్నిసార్లు ఇద్దరు ముగ్గురు ఫీల్డర్లు స్లిప్‌లో ఉంచబడతారు. అప్పుడే చేసే చిన్న పొరపాటు కూడా ఔట్ అవ్వడానికి దారితీస్తుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో సూర్యకుమార్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అలాగే మూడో వన్డేలో కూడా స్లిప్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మాటల ప్రకారం సూర్యకుమార్ వన్డే ఫార్మాట్లలో రాణించాలంటే తన బ్యాటింగ్ ను ఇంకా మెరుగుపరచుకోవాలి.



కోచి వేదికగా ఈ నెల చివర్లో జరిగే వేలంలో 991మంది ఆటగాళ్ల పేర్లు నమోదు అయ్యాయి. నమోదు చేసుకున్న వారిలో వెస్టిండీస్ నుండి 33మంది ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఈ 33 మందిలో డ్వేన్ బ్రావో పేరు లేదు అని తెలుస్తోంది. బ్రావో పేరు లేదని తెలిసిన దగ్గర నుండి అతను కూడా ఐపీఎల్ రిటైర్మెంట్ చెప్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. డ్వేన్ బ్రావో ముంబై జట్టుతో తన ఐపీఎల్ ప్రయాణం మొదలుపెట్టాడు. 2011లో చెన్నై జట్టుతో కలిశాడు. ఇక అప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ 2011, 2012, 2021ల్లో ఐపీఎల్ ట్రోఫీ తేవడంలో ముఖ్యపాత్ర పోషించాడు.
ఇప్పటివరకు బ్రావో 161 ఐపీఎల్ మ్యాచులు ఆడి, 158 వికెట్లు తీసాడు. గత ఏడాదిలో పది మ్యాచులు ఆడి, 16 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ మినీ వేలానికి ముందు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది. అందులో భాగంగా పద్నాలుగు మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుని, మిగతా ఆటగాళ్లను వద్దనుకుంది. వదిలేసిన వారిలో డ్వేన్ బ్రావోతో పాటు జగదీశన్, రాబిన్ ఊతప్ప, ఆడమ్ మిల్నే,క్రిస్ జోర్డాన్ లాంటి వారు ఉన్నారు.
బౌలింగ్ ఆప్షన్‌గా దీపక్ హుడాను తీసుకున్నారని అయితే అనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. దీపక్ హుడాను 6వ బౌలింగ్ ఆప్షన్ గా తీసుకున్నారని అ నుకుంటున్నా, అతను అయితే గొప్ప ఆల్‌రౌండర్ కాదు. అతనికంటే కూడా దీపక్ చహర్ బాగా బౌలింగ్ చేయగలడు. కానీ, తొలిమ్యాచ్‌లో దీపక్ చహర్‌ను కాకుండా శార్దూల్ ఠాకూర్ ను తీసుకున్నారు. నెక్స్ట్ మ్యాచ్‌కే ఠాకూర్‌ను పక్కన పెట్టారు. ఇది సరి అయిన పద్దతి కాదు అని నెహ్రా తెలిపారు
నెహ్రా ఆ తరువాత సంజూ శాంసన్ పై గురించి నేను ఒకవేళ సెలక్టర్ ను అయి ఉంటే మాత్రం సంజూ శాంసన్ ను పక్కన పెట్టి, హుడానే తీసుకునేవాడినని చెప్పారు. అయితే ఇదే చర్చలో పాల్గొన్న మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ వాస్తవానికి సంజూ శాంసన్ గురించి చెప్తూ,అతను కొద్ది కాలంగా బాగా అడుతున్నప్పటికి ఎందుకో అతనికి ఎక్కువ అవకాశాలు రావట్లేదు. తాజాగా ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత పక్కన పెట్టారు అని సంజూకు అండగా నిలబడ్డాడు. మరోవైపు సోషల్ మీడియాలో సంజూశాంసన్ ను వివక్షపూరితంగానే రెండో వన్డేలో తీసుకోలేదంటూ ఫ్యాన్స్ బీసీసీఐని ట్రోల్ చేస్తున్నారు.
ఐపీఎల్లో ట్యాలెంటె ఉన్న ఆటగాళ్లకు భారీ ధర పలుకుతుందనడంలో సందేహమే లేదు. వారి దురదృష్టం కొద్ది ధర కాస్త అటూ ఇటూ అయినా కూడా పోటీ మాత్రం చాలా ఉంటుంది. కానీ ఈ ఆల్‌రౌండర్ కోసం మూడు జట్లు కాచుకొని ఉన్నాయి.అయితే మరి ఆ జట్లు ఏమిటో చూద్దాం.
రాజస్థాన్ రాయల్స్..
కోల్‌కతా నైట్ రైడర్స్..

