Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి SSMB 28 వర్కింగ్ టైటిల్. ఈ చిత్రం కొన్ని రోజుల ముందే మొదటి షెడ్యూల్ షూటింగ్ ను పూర్తిచేశారు. సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేసేలోపే మహేష్ బాబు తండ్రి, సూపర్‌స్టార్ కృష్ణ మరణించారు. దాంతో సెకండ్ షెడ్యూల్ ఆలస్యం అయ్యి, డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మొదలవుతుందని తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, త్రివిక్రమ్ తీసే సినిమాలలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. మహేష్ తో తీసే ఈ మూవీలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్, శ్రీలీల రెండో హీరోయిన్గా నటించనుందని లేటెస్ట్ సమాచారం. అయితే శ్రీలీలతో సంప్రదింపులు కూడా అయ్యాయని తెలుస్తోంది. ఇంకో ఆసక్తికరమైన మాటర్ ఏంటంటే త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ఐటెమ్ సాంగ్‌ను కూడా ప్లాన్ చేశారని సమాచారం. మహేష్‌తో ఓ స్టార్ హీరోయిన్ ఈ సాంగ్‌లో నటించనుందని తెలుస్తోంది. కానీ స్టార్ హీరోయిన్ ఎవరు అని తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

SSMB 28 సినిమాలో గురూజీ ముగ్గురు హీరోయిన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఒక సీనియర్ హీరోయిన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తుందని చెప్తున్నారు. మహేష్ హ్యండ్ సమ్ హీరో, దానికి తగ్గట్లుగా త్రివిక్రమ్ ఈ సినిమాలో మరింత గ్లామర్ ను అద్దుతున్నారని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. మహేష్ ఈ సినిమా కోసం పూర్తిగా తన లుక్‌ని మార్చుకుని,. సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇది మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న 3వ సినిమా. ఇంతకు ముందు అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు.

రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శి తాజాగా ఏబీఎన్ రాధా కృష్ణ షోలో పాల్గొన్నారు. ఆర్కే ఈ సందర్భంగా మాట్లాడుతూ “సినిమా ఇండస్ట్రీ రంగులరాట్నం లాంటిది. ఏమరపాటున ఉంటే చాలా ప్రమాదకరమైందని, అది ఎంత పైకి తీసుకెళ్తుందో, అంతే వేగంగా కింద పడేస్తుందని, ఇదే విజయ్ దేవరకొండ ‘లైగర్’ విషయంలో జరిగింది. ఓవర్ నైట్ స్టార్ గా మరి ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ అలానే టక్కున కిందికి రావాల్సి వచ్చిందని చెప్పాడు.
అయితే దీనికి రాహుల్ రామకృష్ణ స్పందిస్తూ మేము ఇద్దరం కలిసి ‘ఖుషి’ మూవీ చేస్తున్నాం. కానీ సమంతకు ఆరోగ్యం బాలేకపోవడంతో హోల్డ్ లో వుంది. నెక్స్ట్ షెడ్యూల్ మొదలవగానే విజయ్ దేవరకొండని కలుస్తాను. అయితే ఈమధ్య కాలంలో మాట్లాడుకోలేదు. హి ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. ఏదైనా తట్టుకుంటాడు అని అన్నాడు. ప్రియదర్శి విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ హిట్ అండ్ ఫ్లాప్ అనేవి కామన్, విజయ్ చాలా డిఫరెంట్, అతను ఖచ్చితంగా మళ్లీ హిట్టు కొడతాడని అన్నారు.
మరోవైపు విజయ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నటు కనిపిస్తున్నాడు. ఈ మధ్య జరిగిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ అందరు ఎక్కడికి వెళ్ళినా కంబ్యాక్ ఇవ్వాలి అన్నా అంటున్నారని, అయితే తాను ఎక్కడికీ పోలేదని, ఇక్కడే ఉన్నానని తన స్టైల్లో చెప్పి ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచాడు.




మేకర్స్ సోషల్ మీడియాలో సినిమా కంటెంట్ బాగుంటే బాగా ప్రమోట్ చేసుకుంటారు. కంటెంట్ బాగుంటే నెటిజన్స్ కూడా సపోర్ట్ చేస్తారు.అయితే సినిమా బాలేనప్పుడు మాత్రం వాటిని ట్రోలర్స్ పని దొరికినట్టే ఇక.నెటిజెన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటారు. ప్రస్తుతం తమన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన వీరసింహారెడ్డి నుండి ఫస్ట్ సాంగ్ ‘జై బాలయ్య’ విడుదల చేసారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిచారు. అంతే కాకుండా ఈ లిరికల్ వీడియో సాంగ్ లో ఇప్పటివరకు వేసుకొని డ్రెస్ లో తమన్ కనిపించడమే కాకుండా స్టెప్స్ కూడా వేశారు.
అయితే అఖండ తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ పాటను నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని బాలయ్య అభిమానులు ఊహించుకున్నారు. కానీ ఈ పాట నిరాశ పరిచింది. అంతే కాకుండా ఒసేయ్ రాములమ్మ సినిమాలో పాటలా ఉందని ట్రోలింగ్స్ మొదలయ్యాయి.దీంతో నెటిజెన్స్ సోషల్ మీడియాలో తమన్ పై ట్రోల్స్ స్టార్ట్ చేశారు. మీమర్స్, ట్రోలర్స్ తమ చేతికి పని చెప్పారు. బ్రహ్మానందం ఫోటోలతో, వీడియోలతో రెచ్చి పోతున్నారు. డ్రెస్సింగ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్, సాంగ్ మీద పెట్టలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.
బాలకృష్ణ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు.రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీలో శ్రుతీ హాసన్ హీరోయిన్. ఈ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి 2023 కి థియేటర్స్‌లో సందడి చేయటానికి రెడీ అవుతోంది.

ఈ సినిమా పదకొండు వందలకోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అంతే కాకుండా గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపిక అయ్యింది. రాజమౌళి కూడా హాలీవుడ్లో గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం లాంటి అరుదైన గౌరవాలు దక్కాయి. అయితే గత నెలలో ‘ఆర్ఆర్ఆర్’గ్రాండ్‌గా జపాన్ లో విడుదల అయ్యింది. ఈ క్రమంలో అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ మరో ఫీట్ సాధించింది. బాహుబలి’ రికార్డ్స్ ని బీట్ చేసి, అక్కడ అత్యధిక కలెక్షన్లు సాధించిన 2వ ఇండియాన్ సినిమాగా నిలిచింది.
ఇదే కాకుండా అత్యంత వేగంగా మూడు వందల మిలియన్ల క్లబ్లో చేరిన ఫస్ట్ భారతీయ సినిమాగా నిలిచి,రెండవ స్థానంలో ఉన్న బాహుబలి 2 ని వెనక్కి పంపింది. జపాన్‌లో విడుదలైన 34 రోజుల్లోనే అక్కడి కరెన్సీలో 305 మిలియన్ల యెన్లు వసూల్ చేసింది. అంటే మన కరెన్సీలో రూ.17.9 కోట్లు. అయితే 27 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘ముత్తు’ సినిమా విడుదలై రూ.23.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ అదే సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియాన్ సినిమాగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. జపాన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇన్ని ఏళ్లు గడిచిన ఆ రికార్డ్ రజినీ కాంత్ పేరిటే ఉందంటేనే తెలుస్తోంది. ముత్తు సినిమా తరువాత రెండో స్థానంలో నిలిచింది ఆర్ఆర్ఆర్.
ఇక జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో వచ్చే ఏడాది హాలీవుడ్ లేవల్లో అడ్వంచర్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ కోసం ప్రిపేర్ సిద్ధం అవుతుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ లో ఉన్నాడు.


ఒకే ఏడాది ముగ్గురిని కోల్పోయిన మహేష్ తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది అన్నను, తల్లిని, తండ్రిని కోల్పోవడాన్ని మహేష్ బాబుకి తీరని బాధే. మహేష్ కు చిన్నాన్న ఆదిశేషగిరిరావు తోడుగా ఉన్నారు. ఆదిశేషగిరిరావు తన అన్న అయిన కృష్ణతో 70 ఏళ్లపాటు కలిసి ప్రయాణం చేసారు. ఆదిశేషగిరిరావు సైతం అన్నయ్య లేరనే నిజాన్ని నమ్మలేక బాధపడుతున్నారు. వైద్యులు కృష్ణకు గుండెపోటుతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యిందని చెప్పారు. దాని కోసం వైద్యం చేస్తున్నామని చెప్పారు. అయితే ఆరోగ్యంగా ఉన్న ఆయనకు అంత హఠాత్తుగా ఆయన ఆరోగ్యం ఎందుకు క్షీణించింది అని అంతా అనుకుంటున్నారు. మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. దీంతో సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడానిక ముందు అసలు ఏం జరిగింది అనే ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి.
కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఈ విషయం గూర్చి వివరణ ఇచ్చారు. కృష్ణ చనిపోవడానికి ముందు ఎలా ఉన్నారు. తనతో ఏం మాట్లాడారు,ఆ తర్వాత ఏమైంది అని ఆదిశేషగిరి రావు చెప్పారు. కృష్ణ చనిపోయిన ముందురోజు ఆదివారం,ఆరోజున పొద్దునే ఆదిశేషగిరి రావు కృష్ణ దగ్గరకు వెళ్లారట. కృష్ణతో రెండు గంటలకు పైగా గడిపారంట, ఆ సమయంలో కృష్ణ చిన్నప్పటి సంగతులు చాలా చెప్పారని, సైకిల్ పై ఇద్దరూ సినిమాలకెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారట. ఆ మాటలు మాట్లాడుతూ ఇద్దరూ బాగా నవ్వుకున్నారని, సినిమాల గురించి చర్చించుకున్నారు. ఆ సమయంలో కృష్ణలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని ఆదిశేషగిరి రావు చెప్పారు. కృష్ణ ఆ సమయంలో చాలా హుషారుగా కనిపించారని, ఇంట్లోనే భోజనం చేసి వెళ్లమని కృష్ణ అడిగినప్పటికీ, వేరే వాళ్లను భోజనానికి ఇంటికి రమ్మన్నని చెప్పాను. అయితే ఇంకోసారి లంచ్‌కి రా అని అన్నారు. ఆ తరువాత ఇంటికి వచ్చేశానని ఆదిశేషగిరిరావు తెలిపారు.
ఆదివారం రోజు రాత్రి భోజనం చేసి నిద్రపోయిన తరువాత అన్నయ్యకి 12.30కి గుండెపోటు వచ్చిందని చెప్పారు. అన్నయ్యకు గురకపెట్టే అలవాటు ఉంది. గదిలో నుండి గురక శబ్దం వినిపించకపోయేసరికి అన్నయ్య అవసరాలు చూసుకునే కుర్రాడికి అనుమానం వచ్చి పల్స్ చెక్ చేసి, ఏదో తేడాగా అనిపించేసరికి ఫోన్ చేశాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని, ఆ తర్వాత నేను వెళ్లా. కానీ అన్నయ్యకి గుండెపోటు వచ్చి అప్పటికే ముప్పైనిమిషాలు అవడంతో అవయవాల మీద ఆ ప్రభావం పడింది. రక్త ప్రసరణ కూడా ఆగిపోయింది. వైద్యులు 30 గంటలకు పైగా వైద్యం చేశారు.అయిన కూడా ఫలితం లేకపోయిందని ఆదిశేషగిరిరావు తెలిపారు.



