మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటలీలో తన పెళ్లిని చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. నవంబర్ ఒకటో తారీఖున లావణ్య మెడలో మూడు ముళ్ళు వేసి మెగా కోడలినీ చేశారు. ఇటలీలోని అత్యంత పురాతన గ్రామమైన టస్కనీలో బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్ లో ఈ పెళ్లి వేడుక జరిగింది.అయితే వీరు పెళ్లికి ధరించిన బట్టలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఆ బట్టలు ఇంతకీ ఎవరు డిజైన్ చేశారో తెలుసా?
పెళ్లిలో వరుణ్ తేజ్ క్రీమ్ గోల్డ్ షేర్వానీని ధరించి చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు. అటు లావణ్య త్రిపాఠి కూడా ప్రత్యేకంగా కూర్చిన కాంచీపురం చీరలో అద్భుతంగా కనిపించింది. వీరు పెళ్లికి డ్రస్సులు డిజైన్ చేసింది ఇండియాలోనే సెలబ్రిటీలకు వెడ్డింగ్ డిజైనర్ గా పేరు ఉన్న మనిష్ మల్హోత్రా.
అయితే ఈ పెళ్లి డ్రెస్ కోసం వారు లక్షల్లో ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇద్దరీ పెళ్లి బట్టలు దాదాపు 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇక వెడ్డింగ్ లో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్,అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్, నితిన్ వారి కుటుంబ సభ్యులు సందడి చేశారు. మొత్తంగా ఈ పెళ్లి వేడుకకు మెగా కుటుంబం, లావణ్య కుటుంబం తరఫున 120 మంది మాత్రమే హాజరయ్యారు అని తెలుస్తుంది. ఇప్పటికే వరుణ్ లావణ్య ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
మెగా ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఫోటోలు మెగా హీరోలంతా కలిసి దిగిన ఫోటోలు చూసి ఫాన్స్ సంబరపడిపోతున్నారు.మరోపక్క పెళ్లి జరిగిన రిసార్ట్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది. ఒక నైట్ ఒక సూట్ కోసం లక్ష రూపాయలు అద్దె చెల్లించినట్లు వినికిడి. ఏది ఏమైనా సరే మెగా ఇంట పెళ్లి వేడుకంటే ఆ మాత్రం హంగామా ఉండాల్సిందే కదా.పెళ్లి అనంతరం హైదరాబాద్ తిరిగి వచ్చాక భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకు భారీ స్థాయిలో రాజకీయ సిని ప్రముఖులందరూ హాజరుకానున్నారు.
Also Read:“ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశారు..? చూసుకోవాలి కదా..?”