Veera simha Reddy OTT Release: గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, థమన్ దీనికి సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే వీరసింహారెడ్డి మూవీని గతంలో మాదిరిగానే రివేంజ్ స్టోరీతో తెరకెక్కించారు.
అయితే వీరసింహారెడ్డి మూవీ సెకండాఫ్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే బాలయ్య అభిమానులకు మాత్రం ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. అయితే ఈ సినిమా తుది ఫలితం ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: WALTAIR VERAYYA OTT RELEASE: చిరంజీవి “వాల్తేరు వీరయ్య” ఓటీటీ ఫిక్స్..!! వచ్చేది ఎప్పుడంటే..??

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బాలయ్య వీరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ను దాదాపుగా 14 కోట్లు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య గత చిత్రం అఖండ స్ట్రీమింగ్ రైట్స్ కూడా హాట్ స్టార్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి విడుదలైన ఎనిమిది వారాలకు హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్కు రానుంది. ఫిబ్రవరి లో కానీ ఆ తర్వాత కానీ ఈ చిత్రం ఓటీటీ లోకి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

వీరసింహ రెడ్డి మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 61.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ర్నాటక హక్కులు రూ. 4.50 కోట్లకు రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 6.20 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా ఉంది. వీరసింహా రెడ్డి కంటెంట్ ఎక్కువగా మాస్కు అప్పీల్ అవ్వుతుండడంతో బి,సి సెంటర్స్‌లో వీరసింహారెడ్డి అదరగొట్టనుంది. ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేయనుందో చూడాలి.











మేకర్స్ సోషల్ మీడియాలో సినిమా కంటెంట్ బాగుంటే బాగా ప్రమోట్ చేసుకుంటారు. కంటెంట్ బాగుంటే నెటిజన్స్ కూడా సపోర్ట్ చేస్తారు.అయితే సినిమా బాలేనప్పుడు మాత్రం వాటిని ట్రోలర్స్ పని దొరికినట్టే ఇక.నెటిజెన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటారు. ప్రస్తుతం తమన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన వీరసింహారెడ్డి నుండి ఫస్ట్ సాంగ్ ‘జై బాలయ్య’ విడుదల చేసారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిచారు. అంతే కాకుండా ఈ లిరికల్ వీడియో సాంగ్ లో ఇప్పటివరకు వేసుకొని డ్రెస్ లో తమన్ కనిపించడమే కాకుండా స్టెప్స్ కూడా వేశారు.
అయితే అఖండ తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ పాటను నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని బాలయ్య అభిమానులు ఊహించుకున్నారు. కానీ ఈ పాట నిరాశ పరిచింది. అంతే కాకుండా ఒసేయ్ రాములమ్మ సినిమాలో పాటలా ఉందని ట్రోలింగ్స్ మొదలయ్యాయి.దీంతో నెటిజెన్స్ సోషల్ మీడియాలో తమన్ పై ట్రోల్స్ స్టార్ట్ చేశారు. మీమర్స్, ట్రోలర్స్ తమ చేతికి పని చెప్పారు. బ్రహ్మానందం ఫోటోలతో, వీడియోలతో రెచ్చి పోతున్నారు. డ్రెస్సింగ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్, సాంగ్ మీద పెట్టలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.
బాలకృష్ణ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు.రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీలో శ్రుతీ హాసన్ హీరోయిన్. ఈ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి 2023 కి థియేటర్స్‌లో సందడి చేయటానికి రెడీ అవుతోంది.



