ప్రస్తుతం భారత్ లో 2023 ప్రపంచ కప్ సందడి మాములుగా లేదు. ఇప్పటికే భారత్ 9 మ్యాచ్ లు నెగ్గి సెమీఫైనల్స్ కి ఎంటర్ అయింది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టి ఇండియాకి మరో వరల్డ్ కప్ అందిచాలని ఇండియన్ టీం అంతా కసిగా పనిచేస్తుంది. ఇండియా అభిమానులు కూడా భారత్ కు తమ సంపూర్ణ మద్దతు అందిస్తున్నారు.
ఇప్పటివరకు ఇండియా 1983, 2011లో మాత్రమే వరల్డ్ కప్పులను నెగ్గింది. అయితే 2003లో కూడా ఇండియా వరల్డ్ కప్ నెగ్గాల్సి ఉండి మిస్సయింది అనే విషయం మీకు తెలుసా? 2003లో వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియా తలపడ్డాయి. కానీ ఆ మ్యాచ్ లో అనూహ్యంగా ఆస్ట్రేలియా విజయం సాధించింది, ఇండియా ఓటమి పాలైంది.
ఇండియ నెగ్గాల్సిన మ్యాచ్ ఆస్ట్రేలియా నెగ్గడం ఏంటి అని అనుకుంటున్నారా? అప్పట్లో ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తూ 223 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. రిక్కీ పాయింటింగ్ క్రీజ్ లో ఉన్నాడు. అతను 46 పరుగులు వద్ద ఉండగా బౌలర్ వేసిన బంతి ప్యాడ్లు తాకి ఎల్బిడబ్ల్యూ అప్పీల్ చేశారు. కానీ అంపైర్ నాటౌట్ గా ప్రకటించడంతో రిక్కి పాయింటింగ్ సేఫ్ అయ్యాడు. 46 పరుగుల వద్ద అవుట్ అవ్వాల్సిన రిక్కీ పాయింటింగ్ 140 పరుగులు స్కోర్ చేశాడు. థర్డ్ ఎంపైర్ రివ్యూ లో అది అవుతని తేలిన అప్పట్లో డిఆర్ఎస్ సిస్టం లేకపోవడం వల్ల ఇండియా మ్యాచ్ ఓడిపోవలసి వచ్చింది. దాని కారణంగా ఇండియాకి రావాల్సిన వరల్డ్ కప్ ఆస్ట్రేలియా పట్టుకుపోయింది.
ఇప్పుడంటే ఐసీసీ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ప్రతి టీం కి రెండు రివ్యూలు ఇస్తుంది. అంపైర్ డెసిషన్ కరెక్ట్ కాదని అనిపిస్తే ఆ ప్లేయర్స్ రివ్యూ తీసుకుంటున్నారు. చాలా సందర్భాల్లో ప్లేయర్లు రివ్యూలు సక్సెస్ అయిన ఘటనలు కూడా ఉన్నాయి. వాటి వల్ల ఆ టీం విజయాలు కూడా నమోదు చేశాయి. DRS నీ డెసిషన్ రివ్యూ సిస్టం అంటారు. డిఆర్ఎస్ సిస్టం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఇండియన్ మాజీ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని. ధోని రివ్యూ తీసుకున్నాడు అంటే అది కచ్చితంగా అతనికి ఫేవర్ లోనే ఉంటుంది. అభిమానులు ముద్దుగా డిఆర్ఎస్ ని ధోని రివ్యూ సిస్టం కూడా పిలుచుకుంటారు.
watch video:
Also Read:సెంచరీ చేశాక బ్యాట్స్మెన్ తన బ్యాట్ ని ఎందుకు పైకి ఎత్తుతాడు..? కారణం ఏంటంటే..?