రోహిత్ శర్మ టాస్ ఫిక్స్ చేయడం ఏంటి…? వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న నిజం ఎంత..?

రోహిత్ శర్మ టాస్ ఫిక్స్ చేయడం ఏంటి…? వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న నిజం ఎంత..?

by Mounika Singaluri

Ads

2023 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ కి దిగి 398 భారీ స్కోరు చేసింది. భారత్ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. తర్వాత విరాట్ కోహ్లీ అయితే చెలరేగిపోయి ఆడి 50 సెంచరీల రికార్డును కూడా నమోదు చేశాడు.

Video Advertisement

అతనికి తోడు శ్రేయస్ అయ్యర్ కూడా సెంచరీ తో విజృంభించాడు. ఇలా భారత్ బ్యాట్స్ మెన్ లందరూ కూడా మంచి ప్రదర్శన కనబరచడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది.అయితే 399 పరుగుల భారీ లక్ష్యంతో న్యూజిలాండ్ చేధనకు దిగింది. న్యూజిలాండ్ ఓపెనర్ లను షమీ తన అద్భుతమైన బౌలింగ్ తో అవుట్ చేసి పంపించేశాడు.

తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కెప్టెన్ విలియమ్ సన్, మిచెల్ ఇద్దరు కూడా అద్భుతంగా ఆడటం మొదలుపెట్టారు. ఇద్దరూ భారీ పార్టనర్షిప్ ను నమోదు చేశారు.మిచెల్ అయితే సెంచరీని కూడా పూర్తి చేశాడు. మళ్లీ షమీ బౌలింగ్ కి రావడం కేన్ విలియమ్ సన్ ని అవుట్ చేయడం తర్వాత వచ్చిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ అందరిని షమీ ఔట్ చేసి పంపించడంతో భారత్ విజయం ఖరారు చేసుకుంది. షమీ ఏడు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.అయితే భారత చిరకాల ప్రత్యర్థి దాయాది దేశం పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు మాత్రం భారత్ నెగ్గినందుకు సంతోషంగా లేరు. ఎప్పుడూ భారత జట్టు మీద భారత ఆటగాళ్ల మీద పడి ఏడడమే వారికి అలవాటుగా ఉంది.

నిన్న పాకిస్తాన్ మాజీ బౌలర్ సికిందర్ భక్తి రోహిత్ శర్మ పైన విమర్శలు చేశాడు. రోహిత్ శర్మ టాస్ ను ఫిక్స్ చేశాడంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. టాస్ వేసేటప్పుడు రిఫరీ కాయిన్ రోహిత్ శర్మ చేతికి ఇచ్చాడని, అది రోహిత్ దూరంగా టాస్ వేయడంతో న్యూజిలాండ్ కెప్టెన్ కి టాస్ ఏం పడింది అనేది కనపడలేదని, మ్యాచ్ రిఫరీ అయితే టాస్ రోహిత్ నెగినట్లుగా ప్రకటించేసి టాస్ ను ఫిక్స్ చేశారని ఆరోపణలు చేస్తాడు. భారత టాస్ నెగ్గడం వల్లే మ్యాచ్ నెగ్గిందంటూ తమ కక్షను మరోసారి వెళ్లబెట్టుకున్నారు. ఈ పాకిస్తాన్ మాజీ బౌలర్ ఆరోపణలు వింటున్న క్రికెట్ అభిమానులు, భారత అభిమానులు తిరిగి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇది ఐసీసీ టోర్నమెంట్ అనుకున్నారా, పాకిస్తాన్ లో జరిగే గల్లి మ్యాచ్ అనుకున్నారా అంటూ వారిని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.

Watch Video:

ALSO READ : 2023 లో మన ఇండియన్ క్రికెటర్లు అందుకుంటున్న జీతాలు ఎంతో తెలుసా..? అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్న ప్లేయర్ ఎవరంటే..?


End of Article

You may also like