గుండె ఆరోగ్యంగా ఉండాలంటే… ఈ 5 ఆహారపదార్ధాలని రోజూ డైట్ లో తీసుకోండి..!

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే… ఈ 5 ఆహారపదార్ధాలని రోజూ డైట్ లో తీసుకోండి..!

by Megha Varna

Ads

ఈ మధ్య కాలంలో చాలా మంది హృదయ సంబంధిత సమస్యలకు గురవుతున్నారు. హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో గురవుతున్నారు.

Video Advertisement

వారిలో ఎక్కువ మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉండడం బాధాకరం. అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకొనే డైట్ లో మార్పు చేయాల్సి ఉంటుంది.

అయితే మరి గుండె ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి..?, వేటిని ఎక్కువగా తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది అనే దాని గురించి చూద్దాం.  ఎక్కువగా గుండె సమస్యలు రావడానికి గల కారణం చెడు ఆహారపు అలవాట్లు. మారుతున్న జీవనశైలి వలన గుండె సమస్యలు కూడా ఎక్కువైపోయాయి. అయితే డైట్ లో వీటిని తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం.

#1. బెర్రీస్:

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటివి తీసుకుంటే మన ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే హృదయ సంబంధిత సమస్యలు రావు. పైగా వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి కూడా దూరం అవుతుంది.

#2. డ్రై ఫ్రూట్స్:

డ్రై ఫ్రూట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకుంటున్నారు. బాదం, వాల్ నట్స్, ఖర్జూరం మొదలైన డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

#3. తృణధాన్యాలు:

వీటిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు బార్లీ, ఓట్స్ వంటి వాటిని తీసుకోవచ్చు. వీటి వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే హృదయ సంబంధిత సమస్యలు రావు.

#4. క్యారెట్:

క్యారెట్ కూడా గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. క్యారెట్ ను తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

#5. టమాటా:

టమాటా ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఇది రక్తం గడ్డకట్టకుండా కూడా చూస్తుంది. టమాటని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావు.


End of Article

You may also like