“కృష్ణ, కోటా శ్రీనివాసరావు” తో పాటు… కొడుకులని కోల్పోయిన 10 నటులు..!

“కృష్ణ, కోటా శ్రీనివాసరావు” తో పాటు… కొడుకులని కోల్పోయిన 10 నటులు..!

by Mohana Priya

Ads

జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. తమ ముందే పెరిగిన పిల్లలు, వారి ముందే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో చెప్పడానికి కూడా రాదు.

Video Advertisement

అలా సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది ప్రముఖ నటులు వారి పిల్లల్ని కోల్పోయారు. వారిలో కొంత మంది హీరోలు, లేదా ప్రముఖ నటులు వారి కొడుకులని కోల్పోయారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

#1 ఎన్టీఆర్

ఎన్టీఆర్ గారి పెద్ద కొడుకు రామకృష్ణ చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించారు.

telugu actors who lost their sons

#2 పరుచూరి వెంకటేశ్వరరావు

ప్రముఖ రైటర్, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు గారి కొడుకు పరుచూరి రఘుబాబు అనారోగ్యంతో మరణించారు.

telugu actors who lost their sons

#3 కోట శ్రీనివాసరావు

నటుడు కోట శ్రీనివాసరావు గారి కొడుకు కోట ప్రసాద్ రోడ్ యాక్సిడెంట్ లో మరణించారు.

telugu actors who lost their sons

#4 గొల్లపూడి మారుతి రావు

నటుడు గొల్లపూడి మారుతి రావు గారి కొడుకు శ్రీనివాస్ షూటింగ్ సమయంలో మరణించారు. వైజాగ్ బీచ్ లో బండి మీద ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు శ్రీనివాస్ ని ఒక పెద్ద అల దెబ్బ కొట్టింది. అలతో పాటు శ్రీనివాస్ మాయం అయ్యారు. ఆ తర్వాత శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది.

telugu actors who lost their sons

#5 ప్రభుదేవా

ప్రముఖ నటుడు, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కొడుకు చిన్న వయసులో మరణించారు.

telugu actors who lost their sons

#6 కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కొడుకు రమేష్ బాబు అనారోగ్య సమస్యల కారణంగా ఇటీవల కన్ను మూసారు.

telugu actors who lost their sons

#7 తేజ

ప్రముఖ డైరెక్టర్ తేజ కొడుకు అనారోగ్య కారణంగా మరణించారు.

telugu actors who lost their sons

#8 హరికృష్ణ

హరికృష్ణ గారి పెద్ద కొడుకు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.

telugu actors who lost their sons

#9 బాబు మోహన్

ప్రముఖ నటుడు బాబు మోహన్ గారి కొడుకు పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.

telugu actors who lost their sons

#10 ప్రకాష్ రాజ్

ప్రకాష్ కొడుకు కూడా చిన్న వయసులోనే అనారోగ్య సమస్య కారణంగా మరణించాడు.

telugu actors who lost their sons

ఇలా కొంత మంది సినీ ప్రముఖుల కుమారులు వివిధ కారణాల వల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.


End of Article

You may also like