ఈ లక్షణాలు మీలో ఉన్నాయా..? అయితే మీ పిల్లలకి మీరే పెద్ద శత్రువులు..!

ఈ లక్షణాలు మీలో ఉన్నాయా..? అయితే మీ పిల్లలకి మీరే పెద్ద శత్రువులు..!

by Megha Varna

Ads

తల్లిదండ్రులు ఇచ్చే సంస్కారాన్ని బట్టి పిల్లలు ఎదుగుతారు. తల్లిదండ్రులు పిల్లలకి మంచి విలువలు నేర్పితే వాళ్లు కూడా మంచి మార్గంలోనే వెళతారు. లేదంటే చెడు మార్గంలో వెళ్లడం జరుగుతుంది. నిజానికి మీ పిల్లలు సరైన మార్గం లో వెళ్లాలంటే వాళ్ళకి బాధ్యతలను అలవాటు చేయాలి.

Video Advertisement

అప్పుడు మిమ్మల్ని గర్వపడేలా చేస్తారు పిల్లలు. కానీ తల్లిదండ్రులే సక్రమంగా నడుచుకోక పోతే పిల్లలు చెడ్డ దారిన వెళ్లక మరేం చేస్తారు..? ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా ఎన్నో మంచి విషయాలను తెలిపారు.

తల్లిదండ్రులు, పిల్లలకు సంబంధించిన చాలా విషయాలను ఆయన చాణక్య నీతి ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే తల్లిదండ్రుల్లో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే నిజానికి వాళ్ళే పిల్లలకి పెద్ద శత్రువులు అని చెప్పారు. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం.

#1. తప్పుడు ఆలోచనలను రానివ్వదు:

తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లలకి తప్పుడు ఆలోచనలను కలిగేలా చేయకూడదు. అలానే మీ కోరికను లేదా మీరు అనుకున్నది చేయడానికి వాళ్లపై ఒత్తిడి పెట్టకండి. అలానే సొంత ప్రయోజనాల కోసం అబద్దాలు చెప్పడం వాళ్ళకి నేర్పద్దు అని చాణక్య అంటున్నారు.

#2. చదువుని తేలిగ్గా తీసుకోవద్దు:

పిల్లలు చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి తల్లిదండ్రులు. అంతేకానీ లైట్ తీసుకోకండి. పిల్లల చదువు పట్ల శ్రద్ధ పెట్టని తల్లిదండ్రులు శత్రువులతో సమానం అని అన్నారు.

#3. మితిమీరిన ప్రేమ, ఆప్యాయత వద్దు:

ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమను పిల్లలతో పంచుకోకూడదు. ఇది నిజానికి వాళ్ళని మొండిగా మారుస్తుంది. కాబట్టి ఈ తప్పులు తల్లిదండ్రులు చేస్తే పిల్లలు కూడా మంచిగా ఉండలేరు. చక్కటి దారిలో వెళ్లలేరు. కాబట్టి మీరే వాళ్ళకి పెద్ద శత్రువులు అవుతారు.


End of Article

You may also like