ఆ దేశాల్లో క్రిస్మస్ ను ఇంత వింతగా జరుపుకుంటారా..? ఈ ఆచారం గురించి తెలిస్తే షాక్ అవుతారు..!

ఆ దేశాల్లో క్రిస్మస్ ను ఇంత వింతగా జరుపుకుంటారా..? ఈ ఆచారం గురించి తెలిస్తే షాక్ అవుతారు..!

by Megha Varna

Ads

మనుషులంతా ఒకేలా ఉండనట్టే ఆచారాలు, పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. ఒక దేశంలో పాటించే పద్ధతి మరొక దేశంలో అనుసరించాలని రూల్ ఏమీ లేదు. ఎవరి పద్ధతులని వాళ్ళు అనుసరించడం జరుగుతుంది. పండగలలో కూడా వ్యత్యాసం మనం చూడొచ్చు. అయితే మనదేశంలో జరుపుకునేటట్లు క్రిస్మస్ పండగని ఇక్కడ జరిపినట్టే ఇతర దేశాల్లో జరుపుకోరు. వాళ్ల పద్ధతి ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. మన దేశంలో చాలా తక్కువ మంది క్రిస్మస్ ని చేసుకుంటారు.

Video Advertisement

ఇతర దేశాల్లో ఎక్కువ మంది క్రిస్మస్ పండుగను చేసుకుంటారు. యూకేలో అయితే క్రిస్మస్ సమయంలో ఒక వింత ఆచారం పాటిస్తారు. అదే గుర్రం పుర్రె. ఇక ఈ వింత ఆచారం ఏమిటి అనేది చూస్తే.. క్రిస్మస్ పండుగ సమయంలో గుర్రం పుర్రెను ఒక కర్రకు తగిలించి చుట్టూ వస్త్రాలని కప్పి ఉంచుతారు.

ఈ ఆచారం అక్కడ 1800లో మొదలయ్యింది. వస్త్రాల లోపల ఒకరు లేదా ఇద్దరు ఆ కర్రను పట్టుకొని ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఆచారాన్ని అనుసరించడం జరుగుతుంది. ఈ గుర్రం పుర్రెతో ఇంటింటికీ వెళ్లి పాటలు, డాన్సులు చేస్తూ ఉంటారు. యేసుప్రభు తల్లిగా ఆ గుర్రం పుర్రెను భావిస్తారు.

ఇలా గుర్రం తో వచ్చిన వారిని ఇంట్లోకి తీసుకు వెళితే ఏసుప్రభువు తల్లిని తన ఇంటికి ఆహ్వానించినట్లు అక్కడ ప్రజలు నమ్ముతారు. 16,17 శతాబ్దాల్లో గుర్రాలని అక్కడ ప్రజలు పెంచుకునేవారు. అప్పట్లో ఏ వేడుక జరిగినా సరే గుర్రాలు కూడా వాటిలో పాల్గొనేవి. మేరీ ల్యూడ్ వేడుకలో కూడా ఇవి తర్వాత భాగమయ్యాయి.


End of Article

You may also like