నాలుగు నెలల ప్రెగ్నంట్ అయ్యుండి.. పోలీస్ జాబ్ కోసం ఈ అమ్మాయి ఏమి చేసిందో తెలుసా..? ఆమె భర్త అయితే..?

నాలుగు నెలల ప్రెగ్నంట్ అయ్యుండి.. పోలీస్ జాబ్ కోసం ఈ అమ్మాయి ఏమి చేసిందో తెలుసా..? ఆమె భర్త అయితే..?

by Anudeep

Ads

ఈరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం ఏమి కాదు. అలాంటిది పోలీస్ అవ్వాలంటే మరింత కష్టం తో కూడుకున్న పని. పరీక్షలు పాసయ్యే తెలివితేటలతో పాటు.. ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉండాలి. ఎంతో కష్టపడి ఈ పరీక్షలలో పాస్ అయితే తప్ప పోలీస్ ఉద్యోగం రావడం అంత ఈజీ కాదు.

Video Advertisement

aswini 1

మామూలుగానే.. ఈ ఫిజికల్ టెస్ట్ లు అమ్మాయిలకు కొంత కష్టం గా ఉంటాయి. అందులోను.. గర్భవతులు ఈ టెస్ట్ లలో పార్టిసిపేట్ చేయడానికి ఎంతో ఆలోచిస్తారు. బేబీ కి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయపడతారు. ఒకవేళ వారు తెగువ చూపిన.. వారి భర్త, కుటుంబ సభ్యులు అందుకు సహకరించే అవకాశం చాలా తక్కువ. కానీ.. కర్ణాటక లోని కలబురాగికి చెందిన అశ్విని సంతోష్ (24) రూటే సెపరేటు. ఈమె ధైర్యానికి విధి కూడా అబ్బురపడాల్సిందే.

aswini 4

ఆమెకు పోలీస్ అవ్వాలనే కల ఉండేది. చిన్నప్పటినుంచే ఆమె తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసింది. రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం, బరువులు ఎత్తడం లాంటివన్నీ చేసింది. ఆమె మూడు సార్లు ప్రయత్నించినా ఈ పరీక్షలో విఫలమైంది. ఈలోపు వివాహం కూడా అయింది. ఆమె భర్త కూడా ఆమెకు ప్రోత్సాహం ఇచ్చాడు. వరుస గా నాలుగోసారి ఆమె పరీక్షకు సిద్ధమైంది.

aswini 2

సరిగ్గా ఫిజికల్ ఈవెంట్ దగ్గరపడే సమయానికి ఆమె తాను గర్భవతినన్న విషయాన్నీ తెలుసుకుంది. వైద్యులను సంప్రదిస్తే.. ప్రస్తుతానికి నాలుగవ నెల అని… ఈ సమయం లో ఫిజికల్ ఈవెంట్ కు వెళ్తే.. అబార్షన్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయినా ఆమె వెనుకడుగు వేయలేదు. తన భర్త సహకారంతో.. నాలుగు నెలల ప్రెగ్నంట్ గా ఉన్నా కూడా ఫిజికల్ ఈవెంట్ కు హాజరు అయ్యి నాలుగొందల మీటర్ల దూరాన్ని 1.36 సెకన్లలో చేరుకుంది.

aswini 3

ఆ తరువాత పోలీసులకు తన పరిస్థితి ని వివరించింది. ఆమె చెప్పేవరకు ఎవరికీ ఆమె ప్రెగ్నంట్ అన్న విషయం తెలియదు. ఆమె ధైర్య సాహసాలకు పోలీసులు కూడా అబ్బురపడ్డారు. ఫిజికల్ ఈవెంట్ లో పాల్గొనడం మాత్రమే కాకుండా.. క్వాలిఫై అయ్యి చూపించడం తో పోలీస్ అధికారులు కూడా ఆమెను అభినందించారు. రాత పరీక్షలో కూడా క్వాలిఫై అయితే.. ఆమె కు ఈ జాబ్ వచ్చేసినట్లే. ఆమె ఈ పరీక్షలు కూడా పాస్ అయ్యి తన కల నెరవేరాలని కోరుకుందాం.


End of Article

You may also like